బామ్మ..నీది ఎంత గొప్ప మనసు..

Satvika
డబ్బున్న కోటేశ్వరుడు కనీసం కాకికి బిక్షం వెయ్యడానికి వెనకడుగు వేస్తారు..కొంత మంది తనకు ఉన్నదానిలోనే ఇతరులకు సాయం చేస్తారు. అందుకు ఉదాహరణగా అనేక సంఘటలు నిలుస్తున్నాయి. అటువంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు, వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కడుపు నింపుకోవడం కోసం బిక్షాటన చేసే ఓ వృద్ధురాలి మానవత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఆమె చేసిన పనికి ఇప్పుడు అభినందిస్తున్నారు..

వివరాల్లో వెళితే.. ఒడిశా కంధమాల్ జిల్లాలోని ఫుల్బానీలో ఉన్న జగన్నాథ ఆలయానికి భిక్షాటన ద్వారా సంపాదించిన లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఫుల్బానీకి చెందిన తులా బెహెరా కంధమాల్ పట్టణంలో ని వీధుల్లో గత కొన్నేళ్లుగా భిక్షాటన చేస్తూ ఆమె జీవిస్తున్నది. శారీరక వికలాంగుడైన తన భర్తతో కలిసి బిక్షాటన చేయడం ప్రారంభించింది. తన భర్త ప్రఫుల్ల బెహెరాతో కలిసి భిక్షాటన కోసం ఇంటింటికీ తిరిగేది. ఇటీవల భర్త మరణించాడు.. ఇక బెహెరా గురించి పట్టించుకునే బంధువులు, బంధాలు లేకపోవడంతో ఒంటరి అయ్యింది బామ్మ.

ఫుల్బానీ పట్టణంలోని జగన్నాథ ఆలయం, సాయి ఆలయం, ఇతర ఆలయాల ముందు కూర్చుని భిక్షను కోరుతూనే ఉంది..అదే క్రమంలో ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని కూడా దత్తత తీసుకొని అన్నీ తానై జీవిస్తుంది. తులా ఖాతా లో పొదుపు లక్ష రూపాయలు దాటిందని బ్యాంకు అధికారులు ఆమెకు తెలియజేశారు. దీంతో ఆమె పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయ పునరుద్ధరణకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. బెహెరా కు భగవంతునిపై ఉన్న భక్తిని చూసి తాము విరాళం స్వీకరించడానికి అంగీకరించామని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు తెలిపారు.ఆలయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ డబ్బును వినియోగిస్తామని చెప్పారు. ఆలయానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా జీవితకాలం తులా బెహెరకు ప్రసాదం అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: