చిట్టి చెల్లెళ్ల కోసం నాలుగేళ్ల చిన్నారి చేసిన పనికి.. నేటిజన్స్ ఫిదా?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చిన కొన్ని కొన్ని వీడియోలు అయితే ఏకంగా మనసును హత్తుకుంటూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు చేసే చిలిపి పనులు ఎంతోమంది హృదయాన్ని తాకుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా మారిపోయింది. ఇక్కడ ఒక చిన్నారి చేసిన పనికి ఏకంగా నెటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

 ఇక ఆ చిన్నారికి అప్పటికి నాలుగేళ్ల వయసే. ఆ సమయంలోనే ఏకంగా తన చిట్టి చెల్లెలకు రక్షణగా నిలవాలని ఆలోచన ఇక ఆ చిన్నారి మనసులో తట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా చిన్నారి చెల్లెలను కాపాడుటానికి  ఎంతో సమయం స్ఫూర్తి చూపించింది నాలుగేళ్ల చిన్నారి   దీంతో ఇక ఆ బాలిక ఎంతో తెలివిగా ఆలోచించిన తీరు మాత్రం నెటిజన్స్ అందరినీ కూడా ఫిదా చేసేస్తోంది  అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక నాలుగేళ్ల చిన్నారి తన ఇద్దరు చిట్టి చెల్లెల్లతో రోడ్డుమీద ఆడుకుంటుంది.

 చెల్లెళ్లతో సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఇక అదే రోడ్డులో ఒక వాహనం భారీ లోడ్ తో వచ్చింది. అయితే ఇది చూసిన నాలుగేళ్ల చిన్నారి వెంటనే అప్రమత్తమైంది. ఏకంగా తన ఇద్దరు చెల్లెళ్లను కాపాడుకోవడానికి సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. వాహనానికి ఎదురుగా నిలబడి చేతులు అడ్డంగా చాచుతూ ఆపండి ఆపండి అన్నట్లుగా సైగలు చేసింది. ఇది గమనించిన వాహనం నడుపుతున్న వ్యక్తి ఇక ఆ వాహనాన్ని ఆపేశాడు. ఆ తర్వాత తన చిన్నారి చెల్లెలను క్షేమంగా ఒకరి తర్వాత ఒకరిని ఇంటి లోపలికి పంపించండి. ఇక ఆ తర్వాత చివరన ఆ నాలుకెళ్ళి పాప కూడా లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత వాహనాన్ని ముందుకు వెళ్ళమని సైగ చేసింది. దీంతో డ్రైవర్ కూడా బంతిని ముందుకు పోనిచ్చాడు. ఇక ఇది చూసిన ఎంతోమంది ఆ చిన్నారి సమయస్పూర్తికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: