చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు.. సింహాన్ని ఎత్తుకున్న మహిళ?

praveen
ఇటీవల కాలంలో ఎన్నో రకాల పెట్స్ నూ పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు కుక్కనో పిల్లినో తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా పెట్స్ పెంచుకుంటున్నారు. కొంతమంది అయితే మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే ఏకంగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువు మీద అతిగా ప్రేమ చూపిస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తుంది.

 అయితే ఇలా కుక్కలు పిల్లలను పెంచుకుంటున్న వారు మాత్రమే కాదు ఏకంగా ప్రమాదకరమైన జీవులను కూడా పెట్స్ గా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనిషి ప్రాణాలను తీసే  పెద్ద పెద్ద పైథాన్లను సైతం పెట్స్ గా పెంచుకుంటూ ఉండటం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. అంతేకాదు ఇక అడవుల్లో ఎంతో క్రూరమైన జీవులుగా పేరు తెచ్చుకున్న పులులు సింహాలను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు.
 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. సాధారణం గా సింహాలను చూస్తే ఎవరి వెన్ను లో అయినా వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ మాత్రం వైరల్ గా మారిపోయిన వీడియో లో ఒక మహిళ ఏకంగా సింహాన్ని చిన్న పిల్లడిలా చంక
లో ఎత్తుకొని వీధుల్లో తిరగడం.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. సింహం ఏకంగా చిన్నపిల్లాడి లాగానే మారం చేస్తూ ఉంటే ఆ మహిళ మాత్రం నవ్వుకుంటూ ఇక ఆ సింహాన్ని పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంది. ఇక ఈ వీడియో చూసి ఆ మహిళ ధైర్యానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: