మరీ అంత బలుపా.. కోపంతో ఊగిపోతున్న జంతు ప్రేమికులు?

praveen
ఇటీవల కాలంలో కుక్కలకు తెగ డిమాండ్ పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మనుషుల కంటే కుక్కల మీదే ప్రేమ ఎక్కువగా చూపిస్తున్న మనుషులు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక ప్రతి ఇంట్లో కూడా పెంపుడు కుక్కలు దర్శనమిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కుక్కలను పెంచుకోవడం అనేది నేటి రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తమ స్తోమతకు తగ్గట్లుగా ఎంతో ఖర్చు పెట్టి మరి కుక్కలను పెంచుకుంటున్నారు. ఇక వాటిని ఏకంగా చిన్నపిల్లల్లా చూసుకుంటూ ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో  కుక్కలను పెంచుకోవడం ఎక్కువైన కారణంగా కుక్కలకి మనుషులకి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది అని చెప్పాలి.

 అయితే ఇంట్లో ఉన్న వాళ్లకు అయిన ఎంతో ప్రేమగా వండి పెడతారో లేదో తెలియదు కానీ అదే ఇంట్లో ఉండే కుక్కకు మాత్రం ఎంతో హెల్తీ ఫుడ్ పెట్టి ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇకపోతే ఇటీవల కాలంలో ఇలా మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఏర్పడిన బంధానికి సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇలాంటి సమయంలో కొంతమంది ఏకంగా మూగజీవాలను చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.
 ముఖ్యంగా పెంపుడు కుక్కలను దారుణంగా  హింసిస్తూ రాక్షిస్తానందాన్ని పొందుతున్న వీడియోలు అందర్నీ అవక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్. ఇక్కడ ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించిన కాజల్ అనే యువతి ఇటీవలే కుక్క పట్ల అనుచితంగా ప్రవర్తించింది.. వీడియోలో కుక్కపై లేని ప్రేమను నటించి దాన్ని మచ్చిక చేసుకున్నట్లు ప్రవర్తించింది. దీంతో కుక్క అది నమ్మి ఇక ఆ యువతి దగ్గరికి తోక ఊపుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఏకంగా కాలితో తన్ని బూతులు తిడుతూ రాక్షసానందాన్ని పొందింది కాజల్ అనే యువతి. ఇది చూసిన నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు  ఆమెపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: