కొడుకు అత్యుత్సాహం.. తండ్రి ప్రాణాల మీదికి తెచ్చింది?

praveen
ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు ఎంతలా పెరిగిపోయినప్పటికీ అటు పెట్రోల్ బంకుల్లో ఉండే వాహనాల రద్దీ మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి . ఎందుకంటే రోజురోజుకు వాహనాలు వాడుతున్న వారి సంఖ్య పెరిగిపోవడం తప్ప ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి. తద్వారా ఇక పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా కూడా భారీగా క్యూలో నిలబడి మరి పెట్రోల్ కొట్టించుకోవడానికి వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే పెట్రోల్ బంకు కు వెళ్లిన సమయంలో సాధారణంగా వాహనదారుడు క్యూలో నిలబడి ఇక తమ వంతు వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఒకవేళ పెట్రోల్ బంకులో భారీ క్యూ ఉన్న సమయంలో కొంతమంది హడావిడి చేసి ఏదో ఒక విధంగా తమ వాహనంలోనే ముందుగా పెట్రోల్ కొట్టే విధంగా ఏదో ఒకటి వింతగా ప్రయత్నం చేయడం లాంటివి చేస్తూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. ఇక్కడ యువకుడు పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడ క్యూ ఉండడంతో కాస్త హడావిడి చేసాడు. చివరికి తండ్రికి గాయాలు అయ్యేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు చూసుకుంటే.. ఒక వ్యక్తి తన బైక్ తో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుకు వచ్చాడు.  ఇక అతనితో పాటు బైక్ వెనకాల సీట్లో అతని తండ్రి కూర్చున్నాడు. అయితే ఎక్కువ మంది వాహన దారాలు ఉండడంతో అక్కడ కాస్త రద్దీ ఉంది. ఈ క్రమంలోనే అందరూ క్యూలో వస్తు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన బైక్ ని అందరికంటే ముందుకు తీసుకువెళ్లాలని అత్యుత్సాహం ప్రదర్శించాడు కొడుకు. ఇంతలో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా ముందు చక్రం పైకి లేచింది. దీంతో వెనకాల కూర్చున్న తండ్రి ఒక్కసారిగా కింద పడిపోయాడు.. ఈ ఘటనలో తండ్రి వెన్నుకు గాయం అయినట్లు తెలుస్తుంది. ఇలా కొడుకు అచ్యుత్సాహం తండ్రి ప్రాణాల మీదికి తెచ్చింది అని ఎంతో మంది నేటిజన్స్  వీడియో చూశాక కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: