కొండచిలువతో ఆటలు.. చివరికి దానికి కోపం రావడంతో?

praveen
మద్యం ఆరోగ్యానికి హానికరం ప్రాణాలకు ప్రమాదం అని చెప్పినా ఎవ్వరూ వినరు. అయితే కేవలం మద్యం తాగడం మాత్రమే కాదు మద్యం మత్తులో చేసే పనులు కూడా ప్రాణాలకు ప్రమాదం అన్న విషయం తెలిసిందే. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే చివరికి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మద్యం మత్తులో కొంతమంది చేసే పనులు అయితే అందరిని అవాక్కేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 గతం లో ఒక వ్యక్తి మద్యం తాగి ఫుల్ కిక్కులో ఉండి ఏకంగా విషపూరితమైన పామును కొరకడం లాంటి ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా ఎంతో ప్రమాదకరమైన కొండచిలువతో ఆటలు ఆడాడు ఒక వ్యక్తి.  చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. కొండచిలువ విషపూరితమైనది కాకపోయినప్పటికీ ఇక దాని బలంతో ఏకంగా అతని మెడను చుట్టేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ఘటన ఝార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ఒక వృద్ధుడు ఏకంగా మద్యం మత్తులో కొండచిలువతో పరాచకాలు ఆడాడు.

 చివరికి అతని ప్రాణాల మీదికి వచ్చింది. గర్వ జిల్లా లోని పరిహార పంచాయతీకి చెందిన కీతసోటి గూర్చ గ్రామానికి చెందిన బిర్జాలాల్ రామ్ బయాన్ అనే వ్యక్తి కొండ చిలువను పట్టుకొని ఆటలాడటం ప్రారంభించాడు. దీంతో దానికి చిర్రేత్తుకొచ్చింది.  దీంతో వెంటనే కొండ చిలువ అతని మెడను చుట్టేసింది. ఇక ఊపిరాడకుండా చేసింది. దీంతో ప్రాణాలను రక్షించమని ఆ వృద్ధుడు వేడుకున్నాడు. పక్కనే ఉన్న గ్రామస్తులు ఎంతో కష్టపడి ఇక ఆ కొండచిలువను అతని మెడ నుంచి విడిపించారు అని చెప్పాలి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: