వైరల్ : ఏనుగు బీభత్సం.. బైక్ తో ఫుట్బాల్ ఆడింది?

praveen
సాదరణంగా సర్కస్ లో ఏనుగులు చేసే సాహసాలు అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాయి . కొంతమందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఏకంగా బంతితో ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, బైక్ పై వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటివి సర్కస్లో చూసినప్పుడు అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ అదే ఏనుగు సర్కస్లో కాకుండా బయట ఇలాంటివి చేసిందంటే చాలు అందరూ భయపడటం కాదు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు పెడతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఇక్కడ కూడా జరిగింది.

 జార్ఖండ్ లోని రాంచీ సమీపంలో కూర్త్ బహత్ అనే గ్రామంలో ఒక భారీ ఏనుగు బీభత్సం సృష్టించింది అని చెప్పాలి. వ్యవసాయ పొలాలను నాశనం చేసేందుకు వచ్చిన ఏనుగు ఇక వ్యవసాయ పొలాలను నాశనం చేయడమే కాదు అంతటితో ఆగకుండా గ్రామస్తుల పై దాడి చేయడానికి కూడా వెళ్ళింది. ఏకంగా ఏనుగును తరిమెందుకు గ్రామస్తులు ప్రయత్నించగా అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువులను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించింది. దీంతో గ్రామస్తులు అందరూ కూడా భయాందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే గ్రామస్తులు ఇక ఏనుగును తరిమెందుకు పెద్దగా శబ్దాలు చేయడంతో కోపంతో ఊగిపోయిన ఏనుగు అక్కడ ఉన్న ఒక బైక్ తో ఏకంగా ఫుట్బాల్ ఆడేసింది అని చెప్పాలి. తన తొండంతో బైక్ను ఎంతో అలవోకగా పైకి ఎత్తి రోడ్డుపై పడేసింది. ఆ తర్వాత మరోసారి గాల్లోకి బైక్ ను ఎగరేసింది. బైక్ యజమాని అప్పుడే తన సామాన్లు అమ్ముకుని ఇంటికి వెళ్తూ ఉండగా టీ తాగుదామని టీ స్టాల్ దగ్గర ఆగాడు. ఇంతలో ఏనుగు బీభత్సం సృష్టించి అతన్ని బైక్ను తుక్కుతుక్కు చేసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్గా మారిపోయింది. ఇలా ఏనుగు సృష్టించిన విధ్వంసం చూసిన నేటిజన్స్  సైతం షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: