కోతుల ఫన్నీ వీడియో.. చూస్తే నవ్వాల్సిందే?

Purushottham Vinay
సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాకా ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజు కూడా బాగా వైరల్ అవుతూనే ఉంటాయి.అందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అలాగే తాజాగా సోషల్  మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సాధారణంగా కోతులు కానీ అవి చేసే పనులు కానీ చాలా ఫన్నీగా ఉంటాయి.చూడటానికి చాలా సరదాగా ఉంటాయి. ఇక నెట్టింటా బాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో కోతులు చేస్తున్న పని నెటిజన్లను తెగ నవ్విస్తుంది.ఇక కోతులు చేసే పనులు ఒకొక్కసారి బాగా నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని సార్లు అయితే చాలా భయపెడుతుంటాయి. మనం రిలాక్స్ అవ్వడానికి కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటాం .. కానీ కోతులకు మాత్రం అలా కాదు. అవి ఎక్కడుంటే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి.తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా కోతులు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించాయి.


మాములుగా నీళ్లను చూస్తే చిన్న పిల్లలు ఆగలేరు. వెంటనే ఆ నీటిలోకి దిగి వారు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఈ వీడియోలో కోతులు కూడా అదే పని చేశాయి. ఒక కోతి కుటుంబం మొత్తం వెకేషన్ కు వచ్చినట్టు ఒక ఇంటికి వచ్చాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనబడగానే అవి అందులో దూకడం మొదలు పెట్టాయి.పిల్లల స్విమ్మింగ్ పూల్ చూడగానే అవి కూడా దూకడం మొదలుపెట్టాయి. ఆ కోతులు ఒకరు తరువాత ఒకరు వరుసలో నిలబడి నీటిలోకి దూకడం జరిగింది. ఈ వీడియో చూసి చాలా మంది కూడా నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు. కోతులు కూడా ఇలా ఎప్పుడు సరదాగా గడుపుతున్నాయని అయితే మనుషులమైన మనం డిప్రెషన్‌తో బాధపడుతున్నామని కొందరు అంటున్నారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: