మహిళను తొక్కేసిన బస్సు.. గగుర్పాటుకు గురి చేసే యాక్సిడెంట్?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గడం లేదు. కొన్ని కొన్ని సార్లు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే మరికొన్నిసార్లు ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతూ ఉండడం కారణంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. వెరసి రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. మరి కొంత మంది ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. ఇలా ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి.

 ఇలాంటి తరహా వీడియోలు చూసినప్పుడు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయినప్పటికీ మనకేం కాదులే అన్న నిర్లక్ష్యంతోనే ఎంతోమంది ఇక చుట్టుపక్కల వాహనాలు వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా గమనించకుండా రోడ్డు దాటుతు ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ ఏకంగా ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే ఒక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. జుండే వాలన్ లోని కాల్ సెంటర్లో సప్న  యాదవ్ అనే మహిళ పనిచేస్తుంది. అయితే మార్కెట్ ఏరియా రద్దీగా ఉన్న సమయంలో సప్న నడుచుకుంటూ విధులకు వెళుతుంది. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఆగి ఉన్న బస్సు దగ్గర నుంచి వెళ్ళింది. అయితే సప్న బస్సును దాటేందుకు ప్రయత్నించిగా బస్సు అప్పటికే ముందుకు కదిలింది. దీంతో బస్సు డ్రైవర్ కు ముందు ఉన్న సప్న కనిపించలేదు. దీంతో అతను బస్సును అలాగే పోనిచ్చాడు. పక్కన ఉన్నవారు అరుస్తున్న అతనికి వినిపించలేదు. చివరికి బస్సు ఆమెపై నుంచి వెళ్ళింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: