వైరల్ : రెప్పపాటు కాలంలో.. మాయమైన బుల్లెట్ ట్రైన్?

praveen
ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైళ్లు ఎక్కడ ఉన్నాయి అంటే చాలు ప్రతి ఒక్కరు జపాన్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అత్యధిక సదుపాయాలతో కూడిన బుల్లెట్ ట్రైన్స్ కి జపాన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. 1964 నుంచే బుల్లెట్ ట్రైన్ సర్వీసులను అందిస్తుంది జపాన్. సాధారణంగా బుల్లెట్ ట్రైన్ లు గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకు వెళ్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను అటు సోషల్ మీడియాలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైలు వేగాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు.

 ఇక బుల్లెట్ ట్రైన్ ఎంత వేగంగా వెళుతుంది అన్నదానికి సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు ట్విట్టర్ వేదికగా తెగ క్కర్లు కొడుతుంది అని చెప్పాలి. కేవలం కనురెప్ప వాల్చినంత కాలంలోనే అటు బుల్లెట్ ట్రైన్ కనిపించకుండా పోయింది అని చెప్పాలి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తున్న నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు చూసుకుంటే.. ట్రైన్ వెళ్లే రైలు మార్గంలో ఒక వ్యక్తి కెమెరా పట్టుకుని రికార్డ్ చేయాలని భావించాడు.

 ఇక అతను ఇలా కెమెరాలు పెట్టాడో లేదో అంతలోనే  రైలు అతను ఉన్న ప్లేస్ కి దూసుకు వచ్చింది.. అయితే అతను రెప్పవాల్చే కాలంలోనే బుల్లెట్ ట్రైన్ అక్కడి నుంచి మాయమైంది అని చెప్పాలి. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆరు సెకండ్ల నిధివి గల ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి వామ్మో రైలు ఎంత వేగంగా వెళుతుందో.. ఇలాంటి స్పీడ్ లో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: