నిండా ముంచిన ఫ్లిప్ కార్ట్..ఆ తర్వాత..

Satvika
ఆన్‌లైన్ లో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు.తమ ఇంటికి కావలసిన వస్తువులను ఇంట్లోనే కూర్చోని ఎక్కువగా కొంటున్నారు..అయితే వరుస ఆఫర్లను కూడా ఇస్తున్నారు.దాంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లతో కొత్త వస్తువులను అందిస్తున్నారు..ఇక జనం కూడా ఎగబడి కొంటున్నారు..ఇక ఆన్‌లైన్‌లో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే సంబంధంలేని వేరే వస్తువు డెలివరీ అయ్యిందనే వార్తలు వింటూనే ఉంటాం. ఇటివల ఫెస్టివల్ సేల్స్‌లో ఓ వినియోగదారుడు ల్యాప్‌టాప్‌ ఆర్డర్ ఇస్తే ఘడీ డిటర్జెంట్ సబ్బులు డెలివరీ అయ్యాయి..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌డేస్ సమయంలో జరిగిన ఈ ఘటన మరవక ముందే ఇదే తరహా మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈసారి చేతి వాచీ ఆర్డర్ ఇస్తే రెండు జతల ఆడు పేడ పిడకలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ అనే యువతి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సమయంలో సెప్టెంబర్ 28న చేతివాచీకి ఆర్డర్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంది. ఈ వాచీ విలువ రూ.1,304 గా ఉంది. మొత్తానికి 9 రోజుల తర్వాత అక్టోబర్ 7న వాచీ డెలివరీ అయ్యింది. కొత్త వాచీ వచ్చిందనే సంబరంలో ఆత్రుతగా ఓపెన్ చేయగా అందులో రెండు జతల పేడ పిడకలు ఉన్నాయి.

మొత్తం నాలుగు చిన్నచిన్న పిడకలు ఉన్నాయని ఆర్డర్ ఇచ్చిన యువతి నీలం యాదవ్ సోదరుడు రవీంద్ర తెలిపాడు.కొత్త వాచీ అని సంబరపడిపోయిన వ్యక్తి ఆత్రుతగా ఎదురు చూశాడు..దాన్ని ఓపెన్ చేసి షాక్ అయ్యాడు.వెంటనే అలర్ట్ అయిన అతను డెలివరీ బాయ్‌కి కాల్ చేశానని, వేరే పట్టణంలో ఉన్న అతడి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పానని పేర్కొన్నాడు. డబ్బు తిరిగిచ్చేస్తానని ఒప్పుకున్నాడని, డెలివరీ చేసిన పేడ పిడకలను తీసుకున్నాడని రవీంద్ర చెప్పాడు. ఈ విషయాన్ని నవ్‌భారత్‌టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.కాగా ఆన్‌లైన్ సేల్స్‌కు సంబంధించి డెలివరీ చేసిన వ్యక్తి ముందే పార్సిల్ ఓపెన్ చేయడం మంచిది. ఏమైనా పొరపాటు ఉంటే వారికే ప్రొడక్ట్‌ను రిజక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సదురు సంస్థ అధికారులు ఒప్పుకొవాల్సి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: