కొత్త కారు కొన్నాడు.. కానీ పాపం ఇలా జరిగిందేంటి?

praveen
ప్రతి ఒక్కరికి కూడా కారు కొనుగోలు చేయాలనే కల వుంటుంది. ఇక తమ కుటుంబ సభ్యులందరినీ కూడా కారులో కూర్చోబెట్టుకుని కాస్త లాంగ్ డ్రైవ్ వెళ్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది అని ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కారును కొనుగోలు చేసేందుకు ఎన్నో రోజుల నుంచి కష్టపడి డబ్బులు వెనకేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఒకవేళ ఇక కారు కొనాలనే కల నెరవేరితే వారి సంతోషానికి అవధులు ఉండవు అని చెప్పాలి.

 వెంటనే కారు కొనుగోలు చేసి దగ్గర్లో ఉన్న గుడికి తీసుకువెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక ఎంతో సంతోషంగా కారును ఇంటికి తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఎంతో ఆనందంగా తనకు ఇష్టమైన కారు కొనుగోలు చేసి దానికి పూజ చేయించాడు. ఇక ఆ తర్వాత ఆ కారును తీసుకొని ఇంటికి వచ్చాడు. కానీ చివరికి ఊహించని ఘటన ఎదురయింది.  అప్పటివరకు కారును ఎంతో బాగా డ్రైవింగ్ చేసిన సదరు వ్యక్తి. ఒక్కసారిగా వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే కారణం అదుపు చేయలేకపోయాడు.

 చివరికి యాక్సిడెంట్ అయింది. అప్పటి వరకు ఎంతో నెమ్మదిగా కారును గేటు లోపలికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన సదరు వ్యక్తి అంతలో కారు వేగాన్ని పెంచడంతో అక్కడ పార్కు చేసి ఉన్న బైకులపై కొత్త కారు దూసుకు వెళ్ళింది. కొద్దిలో ఆ కారు చివరికి ఫల్టీ కొట్టబోయింది.  అయితే ఈ ఘటనలో  ఎవరికి ప్రాణాపాయం కలగలేదు అని చెప్పాలి. కానీ బైకులు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పాపం కొత్త కారు కొన్నా మన ఆనందం వారికి లేకుండా పోయిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: