వైరల్ : ప్రకృతి ప్రకోపిస్తే.. ఇంత భయంకరంగా ఉంటుందా?

praveen
సాధారణంగా ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో చుట్టుపక్కల ఉన్న అందాలన్నిటినీ కూడా ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే  ఇలా ప్రకృతి అందాలను ఎంతగానో ఎంజాయ్ చేయడానికి ఎంతో మంది టూరిస్టులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ప్రకృతిని చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఇదిలా ఉంటే ఒకవేళ ప్రకృతి ప్రకోపిస్తే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో అన్నది ఇప్పటి వరకు ఎన్నో ఘటనల ద్వారా ఎంతోమంది అర్థం చేసుకున్నారు. ప్రకృతికి కోపం వస్తే మారణహోమం తప్పదు అని చెబుతూ ఉంటారు ఎంతో మంది.

 భారీ భూకంపాలు భారీ వర్షాల వర్షాల కారణంగా వరదలు వరదలతో వచ్చే ప్రాణనష్టం ఇవన్నీ కూడా ప్రకృతి ప్రకోపించినప్పుడు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవలే తైవాన్ దేశంలో కూడా ఇలాంటి ఒక భయానక ఘటన జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఆ దేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తు ఉండటం గమనార్హం. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక ఇటీవల సంభవించిన ఒక భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 నమోదు కావడం గమనార్హం.

 ఇక ఆ తర్వాత రోజు సంభవించిన భూకంపం 6.19 తీవ్రతతో నమోదయింది. భూకంపం తీవ్రత కారణంగా తైవాన్ లో ఉన్న పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. రైలు బొమ్మల్లా ఊగి పోయాయి అనే చెప్పాలి. ఇక ప్రకృతి ప్రకోపించి అక్కడ ఎంతటి భయంకరమైన విధ్వంసం సృష్టించింది అన్న దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. భూకంపం ధాటికి ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూడా ధ్వంసమైన తీరు అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: