వైరల్ : ప్రకృతినే సవాల్ చేసాడు.. ప్రాణం పోయింది?

praveen
దేనితో అయినా ఆటలు ఆడొచ్చు కానీ ప్రకృతితో మాత్రం అస్సలు ఆట ఆడకూడదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కోపం వచ్చిందంటే చాలు కేవలం నిమిషాల వ్యవధి లో ప్రాణాలు పోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవలి కాలం లో ఎంతో మంది ప్రకృతినీ సైతం సవాల్ చేస్తూ నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తు కారణంగా చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వరద ఉన్న ప్రాంతం వైపు వెళుతూ ఉంటారు.

 ప్రమాదవశాత్తు వరదల్లో కొట్టుకుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడూ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు భూమ్మీద నూకలు తినే భాగ్యం లేకపోతే ఇలాంటివి చేస్తారు అని ఎంతో మంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫేతేపూర్ ఏరియా లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 బ్రిడ్జిపై నుంచి వరద ఎంతో ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వరదలోనే వెళ్ళాడు చివరికి కాలు జారీ వరదల్లో రెప్పపాటులో కొట్టుకుపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది. వాహనదారులు తో పాటు పాదచారులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినా సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంతెన దాటాలి అనే ఉద్దేశంతో వరద నీటిలోనే నడవడం ప్రారంభించాడు. చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో ఇలా వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే.  పోలీసుల హెచ్చరిక బోర్డులు పెడుతున్నప్పటికీ ఎంతో మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబంలో విశాదం నింపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: