వైరల్ : విద్యార్థులను ఆటోపై కూర్చోబెట్టాడు.. పేరెంట్స్ షాక్?

praveen
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి  తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా అటు వాహనదారులు మాత్రం ఎక్కడ తమ తీరు మార్చుకోవటం లేదు అనే చెప్పాలి. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ఎప్పుడూ ప్రమాదాలకు కారణం అవుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎన్నో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

 సాధారణ వాహనదారులు మాత్రమే కాదు ఏకంగా స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే  వాహనదారులు సైతం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దారుణంగా ప్రవర్తిస్తూ అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా రిస్క్ లో  పెడుతున్నారు. ఇక ఇలాంటి తరహా వీడియో ఎన్నో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. పరిమితికి మించి విద్యార్థులను వాహనంలో ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్కవుతారు అని చెప్పాలి. సాధారణంగా ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని కాస్త ఇరుకుగా  అయినా  కూర్చోబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

 కానీ ఇక్కడ మాత్రం ఆటోడ్రైవర్ ఏకంగా  ఆటో పైన విద్యార్థులను కూర్చోబెట్టి వాహనాన్ని నడుపుతున్నాడు.   ఉత్తర ప్రదేశ్లోని బరేలిలో  వెలుగులోకి వచ్చింది  ee ఘటన.   సుమారు ముగ్గులు చిన్నారులను ఆటో పైన కూర్చోబెట్టాడు వాహనం నడిపే సదరు వ్యక్తి. వారి వయస్సు 11 నుంచి 13 ఏళ్ల లోపే ఉంటుంది అని చెప్పాలి.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారగా ఇది చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.  ఇంత జరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన ఓ పోలీస్ అధికారి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: