చిరుతపులి ప్రాణం కాపాడిన మంచం.. ఏం జరిగిందో చూడండి?

praveen
ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీనికంతటికీ కారణం మనుషులు అడవులను నరికి ఇక అక్కడే జనావాసాలను నిర్మించుకుంటూ ఉండటమే. జంతువులు నివసించే అడవులలో  మనుషులు ఇల్లు కొట్టుకుంటూ ఉంటే అడవిలో ఉండే జంతువులు జనావాసాల్లోకి  వస్తూ ఉన్నాయ్. ఇలా ఇటీవలి కాలంలో చిరుత పులులు కొన్ని కొన్ని గ్రామాలలోకి తరచూ వస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు భయాందోళనలో మునిగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా జనావాసాల్లోకి వస్తున్న చిరుతపులులను పట్టుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ నీటిలో పోసిన పన్నీరు గానే మారిపోతుంది. దీంతో చిరుతపులులు ఎంతోమందిని గాయపరచడం.. పాడి పశువుల ప్రాణాలు తీయడం లాంటివి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చిరుత పులి కి సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా చిరుత పులిని చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది ఏకంగా చిరుతపులిని ప్రాణాలను కాపాడారు. బావిలో పడి పోయి బయటకి రావడానికి ఇబ్బంది పడుతున్న చిరుత పులి ఒక మంచం సహాయంతో బయటకు తీసుకువచ్చారు.

 ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ లో ఘటన వెలుగు లోకి వచ్చింది. చిరుత పులి ప్రమాద వశాత్తు బావిలో పడి పోయింది. అయితే గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఒక మంచాన్ని బావి లోకి దించి దానిపై చిరుతపులి వచ్చేలా చేసి తాళ్లతో పైకి లాగారు. ఇక ఆ తర్వాత మంచం పై కూర్చొని పైకి వచ్చిన చిరుత పులి అక్కడినుంచి అడవి లోకి వెళ్ళి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫారెస్ట్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: