టెన్షన్ లో క్యాడ్బరీ చాక్లేట్స్ సేల్స్ టీమ్... అదే జరిగితే కష్టమే?

VAMSI
పిల్లలైనా పెద్దలైనా చాక్లెట్ అంటే చాలు ఇట్టే కరిగిపోతారు.. అంత ఇష్టం అందరికీ చాక్లెట్స్ అంటే. తీపి పదార్ధాలు అందరికీ నచ్చకపోవచ్చు కానీ చాక్లెట్ అంటే మాత్రం అందరూ ఇష్టపడుతుంటారు. పిల్లలకయితే చాక్లెట్ ఎంత ఇష్టం అన్నది ప్రత్యేకంగా చెప్పాలా... తిండి , నిద్ర లేకపోయినా కొన్ని చాక్లెట్స్ ఇస్తే చాలు తింటూ ఉండిపోతారు. ఇక నట్స్ తో తయారు అయిన చాక్లెట్ లు అయితే మరీ టేస్ట్ గా ఉంటాయి వీటికి చాలా డిమాండ్ ఎక్కువ. ఈ నట్స్ చాక్లెట్లలో పురుగులు వస్తున్నాయంటూ గతంలో చాలా మంది కంప్లైంట్ చేశారు... అలాంటి వార్తలు చాలానే విన్నాం.
అయితే ఇప్పుడు ఇదే తరహాలో మరో వార్త  సంచలనంగా మారింది.
కర్ణాటకలో వెలుగు చూసిన ఈ విషయం వివరాల్లోకి వెళితే... . ప్రముఖ అంతర్జాతీయ చాక్లెట్ దిగ్గజ సంస్థల్లో క్యాడ్బరీ సంస్థ ఒకటి. అయితే ఈ కంపెనీ నుండి తయారు అయిన ఖరీదైన(రూ.89)  చాక్లెట్ లను కొనుగోలు చేసిన ఒక కస్టమర్ చాక్లెట్ తిందామని ఓపెన్ చేయగా చాక్లెట్ చూసి షాక్ అయ్యాడు. ఆ చాక్లెట్ ను విప్పగానే అందులో  పురుగులు కనిపించాయి. దాంతో షాక్ అయిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిది కాదని భావించి ఈ విషయంపై మొదట సంస్థకు కంప్లైంట్ చేయగా వారు సరిగా స్పందించక పోవడంతో ఆ తరవాత కోర్టును ఆశ్రయించాడు.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు  2016లో కర్ణాటకలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై తీర్పు రావడం తో మరోసారి హైలెట్ అయ్యింది. ఆ వ్యక్తి 2016 అక్టోబరు 26న బెంగళూరులోని అర్బన్ జిల్లా వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించి ఈ విషయం పై కేసు వేశాడు. అయితే ఇది క్యాడ్ బరీ కంపెనీకి ఒక షాక్ అని చెప్పాలి. మరి ఈ విషయం ఆరేళ్ళ తర్వాత తీర్పుతో వెలుగులోకి రావడంతో మళ్ళీ చాకోలెట్ సేల్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటూ ఆందోళనలో ఉన్నారు. అయితే ఇవన్నీ ఇంతకు ముందు చాలానే వచ్చినా.. ఎవ్వరూ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే సెకండ్ క్వార్టర్ సేల్స్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: