బామ్మ డ్యాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో ..

Satvika
కాస్త మ్యూజిక్ వినిపిస్తే చాలా మందికి కాలు కదలడం జరుగుతుంది. ఇక తీన్ మార్ మ్యూజిక్ వినిపిస్తే ఇక జనాలు ఆగుతారా.. రచ్చ రంబొలానే..డ్యాన్స్ వేయడం అంటే అందరికి సరదా.. వయస్సుతో సంబంధం లేకుండా మరి భామలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు..ఇలాంటి వీడియోలు ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శన మిస్తున్నాయి.తాజాగా మరో వీడియో అందరికి షాక్ ఇస్తుంది.అందులో ఓ బామ్మ సూపర్ ఫాస్ట్ స్టెప్పులు వేసి అందరినీ షాక్ కు గురి చేసింది.ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చెస్తుంది..


ఏడు పదుల వయసు దాటిన వృద్ధులు తమ పనిని తామే చేసుకోలేని స్టేజ్‌లో ఉంటారు. ఊతకర్ర సాయం గానీ, మరొకరి సహాయ సహకారాలు గానీ లేకుంటే పనులు చక్కబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సాధారణ ప్రజల్లో ఉండే ఇలాంటి అభిప్రాయాన్ని ఓ వృద్దురాలు మాయం చేసింది. కళ్ళు చెదిరే మాస్ స్టెప్పులేసి అదరహో అనిపించింది.ఆమె స్టామినా చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.పుష్ప సినిమా ఫీవర్ ఇప్పటికీ జనాలను వదలడం లేదు. సామాన్య ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు ఆ సినిమా డైలాగ్స్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.


తగ్గేదెలే డ్తెలాగు ఎంత ఫెమస్ అయ్యిందో అందరికి తెలుసు.అంతకు మించి సామి సామి పాటకు డ్యాన్స్ లు వేస్తూ మరింత ఫెమ్ వచ్చేలా చేశారు.చూడటానికి బక్క పలచగా ఉన్న ఆ వృద్ధురాలు.. తనదైన స్టైల్‌లో 'సామీ సామీ' పాటకు స్టెప్పులేసి సూపర్ అనిపించుకుంది. వయసు కేవలం సంఖ్యకు మాత్రమే, మనసుకు కాదని నిరూపించింది. వృద్ధురాలి డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని చూసిన నెటిజన్లు ఆమె ఎనెర్జి పై షాక్ అవుతున్నారు.. కామెంట్లు చేస్తున్నారు. ఆమెను అందరు నేర్చుకోవాలని సూచిస్తున్నారు...ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లొ చక్కర్లు కోడుతుంది.. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: