అసెంబ్లీలో కొట్టుకున్న మహిళా ఎమ్మెల్యేలు.. ఎక్కడంటే?

praveen
ఎన్నికలలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు అటు శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉంటారు. ఇక తమ ప్రాంత అభివృద్ధి కోసం కావాల్సిన అన్ని విషయాలను కూడా అటు అసెంబ్లీ లో మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అసెంబ్లీలో  ప్రతిపక్షాలు అధికారపక్షం మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరగడం సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ విమర్శలు కాస్త తీవ్రస్థాయికి చేరిన సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాయ్. ఎన్ని నిరసనలు చేసిన ఇక శాసన సభ్యులు మాత్రం ఎంతో హుందాగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 కానీ కొంతమంది మాత్రం ఏకంగా అసెంబ్లీకీ కనీస విలువ ఇవ్వకుండా ఇక్కడ విచిత్రంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన ఎంతోమంది మహిళలు ఏకంగా ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే పంజాబ్ రాష్ట్రంలో. అయితే ఇది భారత్లో ఉన్న పంజాబ్ పాకిస్తాన్  లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ప్రస్తుతం పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది అన్న విషయం తెలిసిందే.

 ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయాడు. ఇక ఇలాంటి రాజకీయ సంక్షోభం సమయంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు కొట్టుకున్న ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. పంజాబ్ సీఎం ఏర్పాటు చేసిన ఒక విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మహిళా ఎమ్మెల్యేల మధ్య వివాదం మొదలైంది. చివరికి అది ఒకరిని ఒకరు కొట్టుకొనేనంత వరకు వెళ్ళింది. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇలా అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేలు కొట్టుకోవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: