ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన సూపర్ పోలీస్!

Purushottham Vinay
ఇక ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది మనుషులు కూడా మరీ సున్నిత మనస్కులు అవుతున్నారు. చిన్న చిన్న అంశాలకే భయపడి తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. వందేళ్లపాటు జీవించాల్సిందిపోయి ఇలా అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.మంచి యుక్తవయసులోనే తనువు చాలిస్తున్నారు. కారణాలేమైనా కాని ముఖ్యంగా యువత ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. ఇక ఏమైందో ఏమో గానీ.. తాజాగా ఓ యువకుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, అతని అదృష్టమో లేక భగవంతుడి దృష్టి పడిందో గానీ.. ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం సూపర్ హీరోలా వచ్చి రెప్పపాటు వ్యవధిలో ఆ యువకుడి ప్రాణాలను వెంటనే కాపాడారు.ఇక ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని విఠల్ వాడి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో అయితే  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది.


ఇక రైల్వే స్టేషన్‌లో నిల్చున్న ఆ యువకుడు రైల్ ట్రాక్‌కు సమీపంగా ఉండి ఊరక అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇక ఇంతలోనే ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఎంటరైంది. రైలు రాకను గమనించిన ఆ యువకుడు ఇక ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్ నుంచి ఆ రైలు పట్టాలపైకి దూకాడు. యువకుడి చర్యను చూసి చుట్టూ ఉన్నవారు అంతా కూడా ఒక్కసారిగా హతాశులయ్యారు. కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏమాత్రం అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇంకా అలాగే రైలు దూసుకొస్తున్నా కూడా అసలు ఏమాత్రం లెక్కచేయకుండా సూపర్‌మ్యాన్ మాదిరిగా పట్టాలపై దూకి ఆ యువకుడిని రక్షించాడు. ఈ దృశ్యమంతా కూడా ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అవగా.. రైల్వే శాఖ ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీస్ అధికారిని బాగా అభినందించింది. ఇక ఆత్మహత్యకు యత్నించిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని అతన్ని బాగా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: