వైరల్ : సింహాలను కుమ్మేసిన ఖడ్గమృగం?

praveen
అడవికి రారాజు సింహం అని చెబుతూ ఉంటారు. అడవిలో ఉండే ప్రతి జంతువు కూడా సింహాన్ని చూసింది అంటే చాలా భయం తో వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే భారీ ఆకారం ఉండే ఏనుగులను సైతం సింహం తన పంజాతో పూర్ణకుంభం పై కొట్టి ఏనుగులను పడగొట్టి తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది. అందుకే ఒక్కసారి సింహం కళ్ళలో పడితే ఏ జంతువు అయినా సరే దానికి ఆహారం గా మారి పోవాల్సిందే అని చెబుతూ ఉంటారు. అందుకే ఇక సింహాన్ని చూస్తే అడవిలో క్రూర మృగాలు పెద్ద పులులు చిరుత పులులు తో పాటు అన్ని జంతువులు కూడా వణికి పోతూ ఉంటాయి.  సింహం వేట మొదలు పెడితే తిరుగుండదు అని చెబుతూ ఉంటారు.

 కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం కాస్త భారీ ఆకారం ఉన్న జంతువులు సింహం వేట నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం లాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి తరహా వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి వస్తు చక్కర్లు కొడుతూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు భారీ ఆకారం ఉండే జంతువులు ఏకంగా అడవికి రాజు అయిన సింహాన్ని భయంతో పరుగులు పెట్టించడం లాంటి వీడియోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా తన కంటే కాస్త ఆకారంలో పెద్ద అయినా ఖడ్గమృగం ని  తమ ఆహారంగా మార్చుకోవాలి  అని మరికొన్ని సింహాలు అనుకుంటాయ్. ఈ క్రమంలోనే ఇక ఆ ఖడ్గమృగం పై దాడి చేసేందుకు ప్రయత్నించాయ్.

 కానీ చివరికి ఖడ్గమృగాన్ని మాత్రం విజయవంతంగా వేటాడే లేకపోయాయి అన్న చెప్పాలి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక సింహం ఆ సరస్సులో నీళ్లు తాగుతూ ఉంది. ఇక అదే నీటి నుంచి బయటకు వస్తుంది పెద్ద ఖడ్గమృగం.  ఇది గమనించిన సింహాల గుంపు నీళ్ళు తాగడాన్ని వదిలేసి వేట మొదలు పెడతాయి ఖడ్గమృగం నీ వెనుక నుంచి పెట్టుకోవాలని ప్రయత్నిస్థాయి. కానీ ఖడ్గమృగం మాత్రం తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన శక్తిని పూర్తిగా ఉపయోగిస్తుంది. తన దగ్గరకి రానివ్వ కుండా సింహాల పై దాడి చేయడం మొదలుపెడుతుంది. సింహాలు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించగానే చివరికి ఖడ్గం పారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: