కాబోయే భర్తకు టెస్ట్ పెట్టిన భార్య.. చివరికి ట్విస్ట్..

Satvika
పెళ్ళి వయస్సు రాగానే యువత ఎన్నెన్నో కలలు కంటారు. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి తమకు నచ్చిన విధంగా ఉండాలని, తన మనసును అర్ధం చేసుకోవాలని ఎన్నెన్నో అనుకుంటారు. అయితే అమ్మాయి అబ్బాయి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనె ఆత్రుత ఉంటుంది. దీని కోసం ఎన్నెన్నో పరీక్షలు పెట్టాలని అనుకుంటారు. అతని మీద ఉన్న కొన్ని సందెహాలను తీర్చుకొవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితం ఎలా వుండాలనే విషయంలోనూ ఒకటికి పదిసార్లు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు.

తనకూ కాబోయే భర్త క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందుకోసం కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తారు.రకరకాల ఐడియాలు వేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని సత్ఫలితాలు ఇస్తే.. మరికొన్ని రివర్స్ అవుతూ ఉంటాయి. ఓ యువతి తనకు కాబోయే భర్తకు ఓ పరీక్ష పెట్టింది. అందుకు తన స్నెహితురాలితో కలిసి మాస్టర్ ప్లాను వేసింది. వివరాల్లొకి వెళితే.. ఈ వింత ఘటన బ్రెజిల్ లో జరిగింది.యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈమెకు అందరి అమ్మాయిల్లాగే ఎన్నో సందేహాలు ఉండేవి. తనకు కాబోయే భర్తకు ఎలాంటి అక్రమ సంబంధాలు ఉండవని బలంగా అనుకుంది.

ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళి తన ఫ్రెండ్ చెప్పింది. తనను తప్ప వేరే యువతిని కన్నెత్తి కూడా చూడడని చెప్పింది. కావాలంటే నువ్వే టెస్ట్ చేయ్ అంటూ పందెం వేసింది. అందుకోసం 6000 పందెం వేసింది.తనకు కాబోయే భర్తకు మెసేజ్ చేసి పరిచయం చేసుకోవాలని సూచించింది. ఆమె చెప్పినట్లుగానే యువకుడికి లిడియా మెసేజ్ చేసింది. ఈమె ఫొటో చూడగానే ఆ వ్యక్తి వెంటనే రిప్లై ఇచ్చాడు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు.  ఎవరూ లేరు నీకు ఇష్టం అయితే ఇద్దరం డేటింగ్ చెద్దామని అడగగా ఆమె షాక్ అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే తన ఫ్రెండ్ కు పంపింది అందుకు సంబంధిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: