వామ్మో: ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ప్రభుత్వం..!!

Divya
రాజస్థాన్ ప్రాంతంలోని జైపూర్ వాయువ్య ప్రాంతంలో ఈ రోజున ఉదయం సమయంలో తీవ్రమైన భూకంపం సంభవించిందని సమాచారం. 3.8 తీవ్రతతో భూకంపం రిక్టర్ స్కేల్ లో నమోదయినట్లు అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మామాలజి తెలియజేయడం జరిగింది.. అది కూడా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లుగా వారు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా NCS ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది.. అయితే ఈ భూకంపం రావడం వల్ల జరిగిన ప్రాణహాని, ఆస్తి నష్టం మొత్తం ఎంత వచ్చింది అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియలేదు.
జైపూర్ కేంద్రానికి 92 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్టు భూకంప కేంద్రం  అధికారులు గుర్తించారు.. ఇక సికార్, ఫతేపూర్ వంటి కొన్ని జిల్లాలలో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గా గుర్తించారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే జమ్మూకాశ్మీర్లో నిన్న, మొన్న కూడా స్వల్ప భూకంపాలు వచ్చినట్లుగా సమాచారం. ఇక నిన్నటి రోజున కత్రా లో ఉదయం రిక్టర్ స్కేలుపై కూడా 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా అక్కడ అధికారులు గుర్తించారు.
ఇక వీటి కంటే ముందుగా పహల్గామ్ లో బుధవారం ఉదయమే 5:40 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయట. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.2 గా క్రేజీ గా నమోదు కావడంతో అక్కడ ఉండే అధికారులు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మామాలజి తెలియజేయడం జరిగింది. ఇది భూకంపం కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గా గుర్తించారు.. అయితే ఇక్కడ కూడా భూకంపానికి గల కారణాలు ఏంటి.. దీని వల్ల  ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లింది అనే విషయంపై ఎక్కడ అధికారులు తెలియజేయడం లేదు. అందుచేతనే అక్కడి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండా లని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: