ఘనంగా మేడారం జాతర.. కానీ సెలవు లేదట..!!

Divya
వనం లో ఉండే దేవతలు జనం మధ్యలోకి వచ్చే సమయం ఆసన్నమయింది కాబట్టి ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ఫిబ్రవరి 19 వరకు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాదు దేశంలో ఎక్కడా జరగని విధంగా అంగరంగ వైభవంగా సుమారుగా కోటి మంది భక్తులకు పైగానే ఈ సమ్మక్క సారక్క దేవతలనుదర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. జనం మధ్యలో తిరుగుతూ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచే మేడారం జాతర అనగానే రాష్ట్ర ప్రభుత్వానికి భయాందోళనలు చుట్టుకుంటాయి.. ఎందుకంటే అంత మంది భక్తులను అదుపు చేయడం అసాధ్యమనే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 10,000 మంది పోలీస్ సిబ్బంది ని ఇక్కడ నియమించినట్లు సమాచారం. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,700 మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు,  భక్తుల ప్రయానార్థం ఇబ్బంది కలగకుండా 3500 ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక 18వ తేదీన మేడారం జాతర లో పాల్గొనడానికి అమ్మవార్లను దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరనున్నారు. ఇకపోతే ఎంతో వైభవంగా జరిగే ఈ మేడారం జాతరలో భక్తులు కుప్పలు తెప్పలుగా తరలివస్తారు.అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికీ 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకోగా మరో 80 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ మేడారం జాతరలో బెల్లంను బంగారంగా భావించి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదిస్తారు. ఇక అయితే భక్తులు అమ్మవార్లను ముక్కు తీర్చుకోవడానికి పట్టు చీరలు, వడిబియ్యం,  పసుపు బట్టలు, బుట్టలు, చిలకలు ,మేకపోతులు, నాటు కోళ్లు ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు మొక్కులు చెల్లించుకుంటారు.  ఇంత అంగరంగ వైభవంగా జరిగే పండుగ అందులోనూ రాష్ట్ర పండుగ అయినా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కారణమేమిటంటే కరోనా సమయంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.అందుకే సెలవులు ప్రకటించలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: