విడసలు మనిషేనా ? ..ఆకలితో వచ్చినవారికి ఇంత దారుణమైన ఆహారం వడ్డిస్తున్నాడా ??

Surya
వారానికోరోజు  ఫ్రెండ్స్ తో, ఫామిలీ తో కలసి భోజనం చేయాలనుకుంటారు ఎవరైనా. అనుకున్నదే తడువుగా ఓ మంచి హోటల్ కి వెళ్లి మంచి ఫుడ్ ఐటెం ని ఆర్డర్ చేస్తారు. కడుపునిండా తిని సంతోషంగా ఇంటికి వెళతారు. కానీ ఇలాంటి ఘటనల గురించి తెలుసుకున్నప్పుడ్డు లేదా చూసినప్పుడు బయటి ఫుడ్ మీదే విరక్తి పుడుతుంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్‌ లో ఓ నీచమైన ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్లకు ఏకంగా బూజు పట్టిన చికెను ,పురుగులు పట్టిన మటన్ మరియు రొయ్యలను వండి వడ్డన చేస్తున్నారు . అంతే కాకుండా రెండు రోజులుగా మిగిలిఉన్న బిర్యానీని తిరిగి వేడి చేసి విక్రయిస్తున్నారు. 



ఇదంతా బండ్లగూడజాగీర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని  ‘జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టు’ అనే  రెస్టారెంట్‌  లో జరిగింది .   మంగళవారం నాడు బండ్లగూడజాగీర్‌ నగరపాలకసంస్థ ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌరీ శెట్టి మరియు స్థానిక తెరాస లీడర్ మద్దెల ప్రేమ్ గౌడ్ ఇంకా ఇంకొంతమంది స్థానికులు కలసి ఆ రెస్టారెంట్ లో తనిఖీ ని నిర్వహించగా అసలు ఫుడ్ పై విరక్తి కలిగే దృశ్యాలు వారికీ దర్శనమిచ్చాయి. వారు ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేసినప్పుడు వారికీ దాదాపుగా కొన్నిరోజులుగా బూజుపట్టిన మాంసం , పురుగులు పట్టిన కోడి మాంసం ఇంకా పురుగులు పట్టిన రొయ్యలు దర్శనమిచ్చాయి. అంతే కాకుండా రెండు రోజులుగా పడివున్న బిర్యానీ ని వారు వేడి చేసి వడ్డన చేస్తున్నట్లు వారు గుర్తించారు.  వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ అతడిపై కేసునమోదు చేసారు. వెంటనే శాంపిల్స్ కోసం ఆ నమూనాలను సేకరించారు. అక్కడి కక్కడే అతడికి 5వేల రూపాయల జరిమానాను విధించారు.

 

బల్దియా గత కొంత కాలంగా హైదరాబాద్ లో కల్తీ మాంసం విక్రయాలపై ద్రుష్టి సారిస్తూ ఉంది. అయితే మాంసం పై జీహెచ్ఎంసీ స్టాంప్ ఉన్న మాంసాన్ని కొనవలసింది నగరపాలక అధికారులకు సూచిస్తూఉంది . నగరం లో వేల సంఖ్యలో మాంసం దుకాణదారులు నిబంధనలకు విడ్డురంగా మాంసం దుకాణాలను నడుపుతున్న నేపథ్యంలో వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. పలు దుకాణాలపై గ్రేటర్ వెటర్నరీ తనిఖీ చేసినప్పుడు వారికీ విస్తుపోయే నిజాలు కనిపించాయి . దుకాణ దారులు భారీగా కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. అయితే ఆ తనిఖీల్లో పాడైన మరియు కల్తీ మాంసాన్ని వారు స్వాధీన పరచుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: