వింత కస్టమర్.. సూప్ నచ్చకపోతే ఇలా చేస్తారా?

praveen
సాధారణంగా హోటల్ అన్న తర్వాత చిత్రవిచిత్రమైన కస్టమర్లు అప్పుడప్పుడూ వస్తూ ఉంటారు. కొంతమంది కస్టమర్లు హోటల్ సిబ్బంది తో ఎంతో హుందాగా నడుచుకుంటూ ఉంటే.. కొంతమంది మాత్రం దురుసుగా ప్రవర్తించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తూ హోటల్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా హోటల్ సిబ్బంది కొన్ని కొన్నిసార్లు కొంతమంది కోపిష్టి కస్టమర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 అయితే హోటల్ కి వచ్చిన కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్ లేట్ గా తీసుకోచ్చిన లేదా ఆహారం రుచిగా లేకపోయినా కూడా గొడవ గొడవ చేసేస్తూ ఉంటారు.. ఇక్కడ ఓ మహిళ ఇలాంటి గొడవ చేసింది. అంతే కాదు ఎంతో దారుణంగా ప్రవర్తించింది. ఏకంగా ఒక వేడి వేడి సూప్ ను హోటల్ మేనేజర్ ముఖం మీద కొట్టి పరారు అయింది. ఈ ఘటన టెక్సాస్లో వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ లోని ఒక రెస్టారెంట్ లో ఒక కస్టమర్ సూప్ ఆర్డర్ చేసింది. అయితే సదరు కస్టమర్కు సర్వ్ చేసిన సూప్ కంటైనర్ లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయ్.

 అంతే కోపంతో  మళ్లీ రెస్టారెంట్ కి వచ్చిన ఆ మహిళా కౌంటర్ దగ్గర ఉన్న మేనేజర్ తో వాగ్వాదానికి దిగింది. కస్టమర్లకు ఇలాంటి ఫుడ్ సర్వ్ చేస్తారా అంటూ కస్సుబుస్సు లాడింది.  కంటైనర్ మూత ఎలా కరిగిపోయింది చూడండి అంటూ వాగ్వివాదానికి దిగింది. ఈ క్రమంలోనే ఇక ఇలా హోటల్ మేనేజర్ తో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏకంగా వేడి వేడి సూప్ మేనేజర్ ముఖంపైన విసిరేసింది. దీంతో ఆ మేనేజర్ ఒక్కసారిగా షాకయ్యారు.  అయితే ఇలా సూప్ ముఖం మీద కొట్టి అక్కడినుంచి హడావిడిగా పరిగెత్తుతూ వెళ్ళిపోయింది సదరు మహిళ. ఇక వెంటనే తేరుకున్న మేనేజర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కారు ఫోటో తీసింది. ఇక ఇదంతా జరగడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. కాగా మేనేజర్ ప్రస్తుతం పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: