భర్త తమ్ముడిపై మోజుతో భర్తపై థ్రిల్లర్ సినిమా స్కెచ్ వేసిన ఇల్లాలు ??

Surya


పెళ్ళైన కొన్ని సంవత్సరాలు ముగ్గురు పిల్లలు పుట్టారు దంపతులకు. కుటుంబ భారం అధికంగా ఉండటంతో స్వతహాగా ట్రక్కు డ్రైవర్ అయినటువంటి భర్త సంపాదనకు వేరే వూరు వెళ్లి గది అద్దెకు తీసుకుని వుంటూ అప్పుడప్పుడు వచ్చి కుటుంబాన్ని చూసివెళుతు ఉండేవాడు. అయితే వీరి జీవితంలోకి ఆమె భర్త దూరపు బంధువు ఐన చిన్నాన్న కొడుకు వచ్చాడు. అతడు భర్తలేని సమయంలో వచ్చిపోతూ ఉండేవాడు. భర్తకూడా అతని భార్యకంటె చిన్నవాడు కనుక వారిమధ్య అలాంటిది ఏమివుందని భావించాడు. అతని తల్లి తండ్రులు కూడా అతను ఓ చిన్నపిల్లవాడుగా అనుకున్నారు. కానీ వారిమధ్య దూరం తరిగింది. భర్తలేని సమయంలో కలిసేవారు. అది చాలదన్నట్లు మధ్యలో మూడునెలలు పారిపోయారు . ఉన్నట్టుండి భార్య తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమం లోనే జోరు వర్షం కురుస్తూవుంది కరెంటు కూడా పోయింది ఇంతలో బోరున ఏడుస్తూ అత్తారింటి కోడలు వచ్చింది.

ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియక అత్తమామలు కంగారుపడ్డారు. ఏమైందమ్మా అని ఆమెని నిలదీశారు. ఆమె ఎంతో భాదతో నాభర్త నామీద కోపంతో విపరీతంగా తాగి వచ్చి కొడుతున్నాడు మీరువచ్చి ఆయనకు బుద్దిచెప్పండి. లేకుంటే నాకు చావే సెరణ్యం అని చెప్పింది. నిజమే అని నమ్మిన వారు ఆమెకు సర్దిచెప్పి ఆమెను తనఇంటికి తీసుకువెళ్లారు. వారు తమ కొడుకు ఇంట్లో గొంతు కోయబడి చనిపోయి ఉండడం వారు గమనించారు . ఇంతలో ఆ కోడలు తానుచేసిన పనికి అవమానభారంతో చనిపోయాడని విలపించింది. అంత నిజమే అని నమ్మి తమ కొడుక్కి అంత్యక్రియలు కూడా చేశారు . ఐతే పోలీసులకు ఇది ఆత్మ హత్య అంటే వారికీ మింగుడు పడలేదు. వెంటనే వారికీ డౌట్ వచ్చింది. తనంతట తాను గొడ్డలితో గొంతు నరుక్కొని ఉండిఉంటే మరి అతని చేతిలో గొడ్డలి అలాగే ఎలావుందీ అని డౌట్ వచ్చింది. వచ్చిందే తడువుగా ఆత్మహత్యచేసుకున్న అతని భార్యను వారి స్టైల్లో విచారణ చేశారు అంతే కథానాయకురాలు జరిగిన బాగోతం బయటపెట్టింది.

వివరాలలోకి వెళితే తమిళనాడు క్రిష్ణగిరి లోని హోసూరు పక్కన డెంకణీకోట కి చెందిన ఉనికిశెట్టి గ్రామంలో నివాసముంటున్న అయ్యప్పన్ (37) తో కొన్ని సంవత్సరాల క్రితం రూప (29) తో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్న అయ్యప్పన్ , రూప భార్యాభర్తలకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు పుట్టారు. అయ్యప్పన్ ఒక ట్రక్ డ్రైవర్ కరోనా సమయంలో ఆర్ధికంగా అప్పులపాలయ్యారు. ఎలాగయినా  సరే ఆ అప్పులను తిరిగి చెల్లించాలని దృఢ నిశ్చయంతో భార్యను పిల్లలను వదిలేసి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి గదిని అద్దెకు తీసుకున్నాడు సమయం కుదిరినప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అయ్యప్పన్ దూరపు చుట్టం అయినటువంటి తంగమణి (20) అనే యువకుడు జవ్వలగిరి సమీపంలోని మంజులగిరిలో నివాసముంటున్నాడు. అయితే అయ్యప్పన్ ఇంటికి తరచూ తంగమణి వచ్చివెళుతు ఉండేవాడు. అయితే అయ్యప్పన్ కి మాత్రం అతనిపై ఏమాత్రం డౌట్ వచ్చేదికాదు కారణం అతను ఆమెకంటే వయసులో చిన్నవాడు కాబట్టి. అయ్యప్పన్ వచ్చివెళ్లిన ప్రతిసారి తంగమణి అయ్యప్పన్ ఇంటికి వచ్చి రూపతో ఘనకార్యాలు నిర్వకించి వెళ్ళేవాడు.


వీరి పై ఆ గ్రామస్తులకు కూడా అనుమానం రానంతగా వీరు జీవించారు. వీరి ఇద్దరిమధ్య రాచకార్యాలు శృతిమించిపోయాయి. హద్దులుమీరిన వీరి బంధం లేచిపోయేవరకు వచ్చింది. దాదాపుగా మూడునెలలు వీరి అదృశ్యం తరువాత అయ్యప్పన్ రూప పై మిస్సింగ్ కేసుపెట్టడం తో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని పట్టుకుని తీసుకువచ్చారు. అప్పటి నుండి అయ్యప్పన్ మతిభ్రమించినవాడిలా ప్రవర్తిస్తూ తాగుడికి బానిస అయ్యాడు. అయితే అయ్యప్పన్ టార్చర్ తట్టుకోలేక రూప తంగమణితో తన భర్తను చంపమని ఫోన్ చేసి చెప్పింది. అంతే తంగమణి తగు ఆయుధాలతో దిగి పోయాడు. అయ్యప్పన్ ఫుల్ గా తాగి అందరుచూస్తూవుండగానే రూపతో గొడవ పడ్డాడు.




ఇంతలో కరెంటు పోయింది అందులోను జోరుగా వర్షం పడుతూవుంది ఇదే అదనుగా తంగమణి అయ్యప్పన్ కాళ్ళు చేతులు కట్టివేసి అతని పీక కోసేశాడు తీవ్ర రక్తస్రావంతో అయ్యప్పన్ చనిపోయాడు . వెంటనే తంగమణి ఎంతో తెలివిగా తాను చంపడానికి వాడిన కత్తిని సినిమాటిక్ గా అయ్యప్పన్ చేతిలో పెట్టి ఏమి తెలియనట్టు వెళ్ళిపోయాడు .... ఈ మధ్యలో రూప అత్తారింటి కి దీనావస్థలో వెళ్లి తనభర్త గురించి చెప్పింది. ఆమెకు నచ్చచెప్పి ఇంటికి తీసుకు రాగ అయ్యప్పన్ చనిపోయి పడి ఉన్నాడు అంతే రూప ఏమి యెరుగనట్టుగా తన భర్త పరువు పోయిందనే ఆత్మహత్యచేసుకొన్నాడని అందరిని నమ్మించింది. కానీ పోలీసులు మాత్రం ఆమె బుట్టలో పడలేదు ...తీగలాగితే డొంకంతా కదిలిందన్న చందాన కేసులోని నిజాలను ఆమె ద్వారా బయటకి కక్కించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: