వైరల్ : ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ఖడ్గం లభ్యం !!!

Surya

ప్రపంచం లోనే అతి ప్రాచీనమైన ఖడ్గం లభించింది.  ఈ ఖడ్గాన్ని క్రూసేడర్ నైట్ వాడే ప్రధాన ఆయుధంగా పురావస్తు శస్త్ర వేత్తలు భావిస్తున్నారు. ఈ ఖడ్గాన్ని మధ్యధరా సముద్ర జలాలలో ష్లోమి కజిన్ అనే వ్యక్తి డైవ్ చేస్తూ ఉండగా ఆ పురాతన ఖడ్గం మరియు ఇంత పురాతన వస్తువులను అతడు కనిపెట్టాడు. వెంటనే కజిన్ ఆ కత్తి మరియు ఇతర వస్తువులను పురాతత్వ శస్త్ర వేత్తలకు అందించాడు. అయితే దొరికిన ఈ ఖడ్గం దాదాపు 900 యేళ్ళనాటి పురాతనమైన  వస్తువుగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఖడ్గాన్ని కజిన్ అక్టోబర్ 16న కనిపెట్టారు.

 అయితే ఈ కత్తి దాదాపుగా 130 సెంటీమీటర్లు పొడవుతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంది. ఇజ్రాయెల్ పురాతత్వ నిపుణులకు ఈ ఆయుధాన్ని మరియు ఇతర వస్తువులను  కజిన్ IAA  కు  అప్పగించిన తరువాత పరిశోధకులు ఖడ్గం పై పరిశోధనలు చేశారు. ఇనుము ప్రధానంగా ఈ ఆయుధం తయారు చేయబడింది. దొరికిన ఈ ఆయుధసామగ్రి 900 యేళ్ళనాటి తీరు తెన్నులను వివరిస్తున్నాయని  అధారిటీ రాబ‌రీ ప్రివెన్ష‌న్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్ట‌ర్ నిర్ డిటెల్ఫెల్డ్ తెలిపారు. IAA మెరైన్ ఆర్కియాలాజికల్ యూనిట్ అధికారి కోబి శర్విత్ మాట్లాడుతూ ..ఖడ్గం మరియు వస్తువులు దొరికిన ప్రాంతం లో కొన్ని వందల ఏళ్ళ క్రితం పడవలు ఈ ప్రాంతం నుండి ప్రయాణించేవి అని ..ఈ క్రమం లోనే ఈ పురాతన వస్తువులు మరియు ఈ ఖడ్గం లభించి ఉండవచ్చు అని అన్నారు . అయితే పురాతన ఖడ్గాన్ని పూర్తిగా శుభ్రపరచడం జరిగింది. 



ఈ ఖడ్గం హైఫా నగరం నుండి 650 ఫీట్ల దూరం లో 13 ఫీట్ల లోతులో కనిపెట్టడం జరిగింది.   కత్తి మటుకు 900 కంటే పురాతనమైనది అయినప్పటికీ తుప్పుపట్టలేదు. అయితే కజిన్ కి దొరికిన అన్ని పురాతన వస్తువులను త్వరలో ప్రదర్శనకు పెట్టనున్నారు. ప్రస్తుతం దొరికిన ఈ పురాతన ఆయుధాలే కాకుండా గతం లో ఇజ్రాయెల్ లోని సెంట్రల్ టౌన్ యనే లో అతి పురాత వైన్ మేకింగ్ కాంప్లెక్ వెలికితీశారు. అయితే బయట పడిన ఆ ప్రాంతాన్ని 1500 యేండ్ల నాటి పురాతన వైన్ మేకింగ్ కాంప్లెక్ గా పరిశోధకులు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: