ఏలాంటి నీటినైనా ఒక్క టాబ్లెట్ తో తాగునీరుగా మార్చవచ్చు..!

Divya
కొంతమంది శాస్త్రవేత్తలు తాగునీటిపై కొన్ని పరిశోధనలు చేసి ఒక పెద్ద శుభవార్త అని తెలియజేశారు. కొన్ని ప్రదేశాలలో ఇప్పటివరకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకుండా ఉన్న వారికి ఇది ఒక చక్కటి శుభవార్త లాంటిది.అలాంటి వారి కోసం మన శాస్త్రవేత్తలు ఎలాంటి వాటిని కనిపెట్టారో ఇప్పుడు చూద్దాం.
శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం హైడ్రోజేల్  టాబ్లెట్ను వాడుకోవడం ద్వారా చెరువులోని నీటిని కొన్నింటిని తీసుకొని అందులోకి ఈ టాబ్లెట్ వేయడం ద్వారా ఒక గంట సేపటికి అవి స్వచ్ఛమైన నీరుగా మారుతాయి అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ టాబ్లెట్ ఖచ్చితంగా..99.9% బ్యాక్టీరియా ఆ నీటిలో లేకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు.USA లో టెక్సాస్ అనే విశ్వవిద్యాలయంలో ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేశారు.
మనం స్వచ్ఛమైన నీరు కావాలంటే ఆ నీటిని మరగబెట్టి కాచుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా ఈ కొత్తగా వచ్చిన హైడ్రోజెల్ అనే టాబ్లెట్ ద్వారానే చాలా సురక్షితంగా నీటిని చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం అది ఎలా పనిచేస్తుందంటే..
ఒక నదీ లేదా చెరువులోని నీటిని తీసుకొని ఒక టాంకర్ లో ఉంచి అందులో ఈ టాబ్లెట్ ని వేయాలి అలా ఒక గంట సేపు తర్వాత ఆ టాబ్లెట్ బయటకు తీసేసి ఆ నీటిని మనం త్రాగవచ్చు అని తెలియజేస్తున్నారు. పరిశోధకులు తెలిపిన ప్రకారం.. ఆ నీటిలో ఈ టాబ్లెట్ వేసిన తర్వాత.. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేస్తుందట.ఇది కార్బన్ కణాలతో కలిసిపోయి నీటిలో ఉండే బ్యాక్టీరియాను చంపుతోంది అని తెలియజేస్తున్నారు.
ఆ తర్వాత  మనుషులు ఇ నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి హానీ జరగదని తెలియజేస్తున్నారు. ఈ హైడ్రోజెల్ టాబ్లెట్ ల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ టాబ్లెట్లను త్వరలోనే అందరికీ అందుబాటులో ఉంచబోతున్నారు అన్నట్లుగా తెలియజేస్తున్నారు.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: