వైరల్: ఒక్క చికెన్ ముక్కకు బిల్ ఎంత అయిందో తెలుసా ?

VAMSI
ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. అయితే కొన్ని వార్తలు చూడగానే మనకు ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. వామ్మో ? వావ్ ? అంటూ అనేస్తూ ఉంటాము. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలిస్తే మరి మీరేమంటారో చూద్దాం. మామూలుగా ఒక ఫ్యామిలీ మొత్తం ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి ఫుల్ గా మనకు నచ్చింది తింటే ఎంత బిల్ అవుతుంది. ఎంత కాదన్నా ఒక పది వేల లోపు మాత్రమే అవుతుంది. అయితే ఇక్కడ ఇక అమ్మాయి మాత్రం కేవలం ఒక చికెన్ ముక్కకు 3,000 బిల్ వేశారట సదరు హోటల్ వాళ్ళు? ఇందుకు కారణం ఏమిటి తప్పిదం ఎక్కడ జరిగింది తెలియాలంటే పూర్తిగా కథలోకి వెళ్లాల్సిందే.
ఆ యువతి పేరు రవీన్ లండన్ నగరంలో జీవిస్తూ ఉంది. ఆమె సరదాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అలా లండన్ వీధుల్లో  షికారు చేస్తూ భోజనం చేయడానికి అక్కడ ఫేమస్ హోటల్ ది షార్డ్ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఇద్దరూ టేబుల్ పై కూర్చుని ఒక ఫేవరేట్ డిష్ ఆర్డర్ చేశారు. మామూలుగా ఆ డిష్ ధర 30 ఫౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో 3000 రూపాయలు కావడం విశేషం. అయితే ఆర్డర్ చేసిన కొంత సమయానికి ఆ ఫుడ్ రానే వచ్చింది. ఆ ఫుడ్ చూసిన రవీన్ షాక్ కు గురయింది. ఆ ప్లేట్ లో కేవలం ఒక చికెన్ ముక్క, బంగాళాదుంప, సాస్ ఉన్నాయి అంతే. 3000 రూపాయలు చెల్లిస్తే ఇలాంటి ఫుడ్ ఇచ్చారా అని నిరాశకు గురి అయ్యారట.
ఈ సంఘటనను ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. అంతే కాకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చెల్లించిన అమౌంట్ కు తెచ్చిన ఫుడ్ కు ఏమాత్రం పోలిక లేదంటూ ఆ డిష్ ఉండే ప్లేట్ ను సైతం పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ ఆమెపై జాలి పడుతున్నారు. ఎన్నో ఆశలతో బాయ్ ఫ్రెండ్ తో సరదాగా తింటూ కబుర్లు చెప్పుకుందామని భావించిన రవీన్ కు నిరాశే ఎదురయింది. దీనితో అవేశం పట్టలేక హోటల్ యాజమాన్యం పై అరిచి వెళ్ళిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: