బాతు, దాని పిల్లలపై మానవత్వం చూపించిన మహిళ...

Purushottham Vinay
ఈ లోకంలో మానవత్వానికి మించింది ఏదీ లేదు. అన్నిటికంటే మానవత్వం గొప్పది. దేవుడు మనిషిగా పుట్టినందుకు కొన్ని మంచు పనులైనా చేయాలి. ఈ లోకంలో మంచి చెడు తెలిసిన ఏకైక జాతి మానవ జాతి. అందుకే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవ జాతికి మించిన జాతి ఏదీ లేదనే చెప్పాలి.ఇక మనిషి అన్నాక కేవలం తన స్వలాభం, స్వార్ధం చూసుకోకుండా  కష్టాల్లో ఉన్న తోటి మనుషులకు సాయం చెయ్యాలి.. తోటి వ్యక్తికే కాదు. ఈ భూమ్మీద బ్రతికే తోటి జీవ రాశులకి ఇతర మూగ జీవులకు కూడా సాయం చేస్తూ మానవత్వాన్ని చాటాలి. లేకపోతే.. ఈ జీవితం సార్థకం కాదు.ఓ మహిళ తన కారును ఆపి బాతు, దాని పిలల్లు సురక్షితంగా రోడ్డు దాటేందుకు సహకరించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళ చేసిన మంచి పని చూస్తే తప్పకుండా మనసు తాకుతుంది. ఆ బాతు మనుసును అర్థం చేసుకుని.. సాయానికి ముందుకొచ్చిన ఆమెకు సలాం కొట్టాలనిపిస్తుంది.

జెస్సికా ఫాయే ఉండా అనే మహిళ దీన్ని ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఓ బాతు తన పిల్లలో రోడ్డు దాటాలనుకుంది. అయితే, వాహనాలు వేగంగా దూసుకెళ్తుండటంతో ముందుకు కదల్లేక రోడ్డు పక్కన నిలుచుని ఉంది. అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న మహిళ ఆ బాతులను చూసి కారు పక్కన ఆపింది. ఆ తర్వాత రోడ్డు మీదకు వెళ్లి మిగతా వాహనాలను ఆపింది. దీంతో ఆ బాతు తన పిల్లలతో రోడ్డు దాటింది. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన మంచి పని’’ అని జెస్సికా పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోను చత్తీస్‌గడ్‌కు చెందిన అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘అంతా ఆ మహిళ తరహాలో మంచి విలువలు, దయ, కరుణతో మెలిగితే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చేయొచ్చు’’ అని పేర్కొనడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం నెట్టింటా వైరల్ అవుతున్న ఈ  వీడియోను కింద వున్న ఇంస్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి మీరు కూడా చూసేయండి.
https://www.instagram.com/p/CPGr5K_AV_u/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: