ఆ తల్లి పరిస్థితి పగోడీకి కూడా రాకూడదు.. అయ్యో పాపం..

Satvika
తల్లి అవ్వడం అంటే మరో జన్మ ఎత్తడం అని అంటారు.. తన కడుపులో మరో శిశువు ప్రాణం పోసుకుంటుంది అంటే ఆమె సంతోషానికి అవధులు ఉండవు. అందుకే భారతీయులు ఆమెకు ప్రత్యేక స్థానాన్ని అందించారు. అలాంటి తియ్యని అనుభూతి ఓ తల్లికి ఎన్నో రోజులు నిలవలేదు. కేవలం 14 వారాలకే ఆమె సంతోషాన్ని దేవుడు దూరం చేశాడు.14 వారాలకే కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో వైద్యులు ఆమె గర్భం నుంచి పిండాన్ని బయటకు తీశారు. మహిళ కోరడంతో.. సదరు పిండాన్ని ఆమెకే ఇచ్చేశారు. అయితే తన బుజ్జి ప్రతిరూపాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న ఆ మహిళ..

ఆ బిడ్డ జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంది. కానీ అది అసాధ్యం. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆలోచన తట్టింది. మొక్కలను పెంచే పూలకుండీలో ఆ పసిగుడ్డు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కన్నీరు పెట్టించే ఈ ఘటన అమెరికాలోని సిస్సోరీలో వెలుగు చూసింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండె సంబంధిత సమస్యతో అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో అబార్షన్ ద్వారా పిండాన్ని తొలగించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో పిండం రక్తపు ముద్దగా మారుతుంది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో సర్జరీ ద్వారా ఆ బుజ్జి పిండాన్ని వైద్యులు బయటకు తీశారు.

ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే.. 14 వారాలకే ఆ పిండానికి అవయవాలు అన్నీ ఏర్పడ్డాయి.  అక్కడ పడేయడానికి ఇష్టపడని మహిళ మృతపిండాన్ని సిలైన్ సీసా లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. అతికష్టం మీద వారం రోజుల పాటు ఆ పిండాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన శర్రాన్.. చివరికి మనసు చంపుకొని పూడ్చి పెట్టింది. ఆ పసి పిండానికి గుర్తుగా పూల కుండీ లో పూడ్చి పెట్టింది. తన బిడ్డను మొక్క రూపం లో చూసుకుంటూ మురిసిపోతుంది.. నిజంగా ఇలాంటి ఘటన పగోడికి కూడా రాకుకూడదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: