మీ వద్ద వున్న డబ్బును రెట్టింపు చేసే పోస్ట్ ఆఫీసు కొత్త స్కీమ్..
ఐతే అందులో మన డబ్బుకు గ్యారెంటీ వుంటుందని చెప్పలేం. అయితే మీరు డబ్బులు ఎక్కడ పెట్టాలి? అని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు ..డబుల్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ పలు రకాల సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది..
కచ్చితమైన లాభం వస్తుంది. అయితే ఇక్కడ డబ్బులు రెట్టింపు కావాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాలి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు. ఈ కాలంలో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు 6.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది.