హెరాల్డ్ వైరలెహే : ఆహా.. ఎంత టీ బాగా తాగుతున్నావే.. బల్లీ!

Edari Rama Krishna
ప్రపంచంలో చాయ్ అదే అంటే టీ అంటే తెలియని వారు ఉండరు.. భారతీయులకు బ్రిటీష్ వాడు ఏది ఇచ్చినా ఇవ్వకున్నా.. టీ వ్యసనాన్ని మాత్రం బాగా అంటగట్టి పోయారని అంటుంటారు.  ఈ టీ పై ఎన్నో కవితలు, పాటలు వచ్చాయి. ఉదయం లేవగానే మంచి నీళ్ల కన్నా టీ తాగి సంతృప్తి చెందేవారు కోట్ల మంది ఉన్నారు. ఇక టీ అమ్ముతూ వేల కుటుంబాలు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.  మృగరాజు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పాడిన పాట టీ చమక్కున్నా తాగరా భాయ్.. అంటూ ఊర్రూతలూగించి టీ విశిష్టతను వెల్లడించారు.  అలాంటి టీ చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒక్కరోజు టీ తాగకపోతే కొంత మంది పిచ్చేక్కి పోయి.. తలపోటు వచ్చే వారు కూడా ఉన్నారు.  

అన్నం లేకున్నా పరవాలేదు కానీ.. టీ లేకుండా ఉండలేం బాబో అనే వారు కూడా ఉన్నారు.  అలాంటి టీ ఓ బల్లి గుటకలు వేసుకుంటూ తాగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  సాధారణంగా గోడ‌ల మీద తిరిగే బ‌ల్లి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఓ క‌ప్పు టీ తాగి ఆ త‌ర్వాత వేట మొద‌లుపెడుతుంది. మ‌రి బ‌ల్లి టీ ఎలా తాగుతుంది. ఎవ‌రు త‌యారు చేసిస్తారు అనే సందేహం త‌ప్ప‌కుండా వ‌స్తుంది. బ‌ల్లి టీ త‌యారు చేసుకోలేదు క‌దా అందుక‌ని ఆ ఇంటి య‌జ‌మాని కుటుంబ స‌భ్యుల‌తో పాటు క‌ప్పు టీ బ‌ల్లికి కూడా ఇస్తుంద‌ట‌.

భ‌ర‌త్‌పూర్‌లోని ఓ మ‌హిళ ప్ర‌తిరోజూ కుటుంబ స‌భ్యుల‌కు టీ చేసి క‌ప్పులో పోసి తాగండ‌ని టేబుల్ మీద పెడుతున్న‌ది. ఒక‌రోజు ఎవ‌రూ స‌మ‌యంలో బ‌ల్లి ఆ క‌ప్పులోని టీ తాగుతుండ‌డం ఆ ఇంటి యజమానురాలు గమనించి మొదట ఆశ్చర్యపోయిందట. ఆహా ఈ బల్లి కూడా టీ రుచి నచ్చినట్టు ఉందని ఆ రోజు నుంచి బ‌ల్లికి కూడా టీ తాగాలని ఉంటుంది క‌దా అని క‌ప్పులో పోసి ప‌క్క‌న పెడుతుంది. బ‌ల్లికి, మ‌హిళ‌కు  మంచి అండ‌ర్‌స్టాడింగ్ కుదిరింది. ఇంకేముంది రోజూ కుటుంబ స‌భ్యుల‌కు టీ ఇచ్చేట‌ప్పుడు బ‌ల్లికి కూడా ఇస్తుంది. గ‌త రెండు నెల‌ల నుంచి ఆ బ‌ల్లి కూడా కుటుంబంలో భాగ‌మైంది. ఇదొక‌టే కాదు రెండేళ్ల కింద‌ట కూడా ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: