Tik Tok కి ఏడాది పూర్తి....ఇండియాలో పాపులర్ వీడియోస్ ఇవే...!!!!

NCR

టిక్ టాక్ ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. చైనా కంపెనీ బైట్ డాన్స్ ప్రవేశపెట్టిన ఈ టిక్ టాక్ యాప్ సోషల్ మీడియాలోనే భారీ మార్పు తీసుకువచ్చింది. రోజు రోజుకి అన్ని వర్గాల ప్రజలకి మరింత దగ్గరవుతోంది. ఎన్ని సమస్యలు వచ్చినా సరే అన్నిటిని అధిగమిస్తూ దూసుకువెళ్తోంది. దాదాపు 30 కోట్ల మంది యూజర్స్ తో పిచ్చ క్రేజ్ తో ఉన్న ఈ యాప్ ఎంతో మందిలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి చూపిస్తోంది. టిక్ టాక్ వచ్చి సంవత్సరం అవుతుండగా ఈ సంవత్సర కాలంలో వైవిధ్యమైన వీడియోలు ఎన్నో వైరల్ అవుతూ వచ్చాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన వీడియోలు ఒక్క సారి పరిశీలిస్తే..

 

#desifood – ఈ యాప్ ద్వారా ఎంతో మంది తమక వంటలు చేయడంలో ఉన్న టాలెంట్ చూపిస్తూ క్షణాలలో ఫుడ్ ఎలా తయారుచేసుకోవాలో చేసి చూపిస్తున్నారు. దాంతో ఇది మోస్ట్ పాపులర్ వీడియోలలో ఒకటి అయ్యింది.

 

#TikTokTravel: తాజాగా టిక్ టాక్ #yehmeraindia అనే ట్యాగ్ తీసుకువచ్చింది. దీనిద్వారా ప్రపంచ దేశాలకి ఇండియాలో పలు ప్రాంతాలకి చేరుకునేలా సూచనలు ఇస్తూ ఉంటుంది.

 

#BottleCapChallenge : సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెద్ద పెద్ద స్టార్స్ మొదలు , ప్రపంచ వ్యాప్తంగా ఈ ఛాలెంజ్ పై వీడియోలు తీశారు. ఏడాది సమయంలో సంచలనం సృష్టించిన వీడియోలలో ఇది ముఖ్యమైనది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: