విద్యార్థి ఆలోచన అద్భుతం.. ఏం తయారు చేశాడో తెలుసా?

praveen
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఈ విషయాన్ని నేటి తరంలో ఎంతోమంది జనాలు నిరూపిస్తూ ఉన్నారు. చేయాలనే సంకల్పం ఇక టాలెంట్ ఉండాలి కానీ చేయలేనిది ఏదీ లేదు అంటూ ఎంతో మంది చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నేటి జనరేషన్ పిల్లలు ఏకంగా విద్యార్థి దశలోనే అద్భుతాలు సృష్టిస్తూ ఉండడం లాంటి ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇలా చదువుకుంటున్న సమయంలోనే సృష్టిస్తున్న ఆవిష్కరణలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.

 ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేవిగేషన్ మ్యాప్ పైన ఆధారపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పటిలా రోడ్డుపైన కనిపించిన మనుషులందరినీ కూడా అడుగుతూ వెళ్లడం కాకుండా.. ఇలా నేవిగేషన్ ఆధారంగానే ప్రయాణాలను సాగిస్తూ ఉన్నారు. అయితే కళ్ళు ఉన్నవారు ఇలా నేవిగేషన్ చూస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కళ్ళు లేని వారికి ఎలా తెలిసేది అని ఇక్కడ ఒక విద్యార్థి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.

 ఈ క్రమంలోనే అద్భుతమైన కళ్లద్దాలను తయారు చేశాడు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ADLB ఇంజనీరింగ్ విద్యార్థి టీ రవి కిరణ్ తయారు చేసిన బ్లైండ్ ఐ కళ్ళద్దాలకు అంతర్జాతీయ అవార్డు దక్కింది.  ఇస్తాంబుల్ లో UNiCEF నిర్వహించిన గ్లోబల్ ఇంక్యుబేషన్ వీక్ లో దీనిని ప్రదర్శించారు. అధునాతన సెన్సార్లు కెమెరా స్పీకర్ మైక్రోఫోన్ కలిగిన ఈ కళ్లద్దాలు.. సురక్షితమైన నావిగేషన్ను చెప్పగలవు. అంతేకాకుండా వస్తువులను గుర్తించి చదివి వినిపించగలవు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి టాలెంట్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఇలాంటి మేధావులు ఇండియాలో ఎంతోమంది ఉన్నారని.. కానీ సరైన ప్రోత్సాహం లేక తెరమీదకి రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: