ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో ఏసర్ ల్యాప్‌టాప్స్‌ లాంచ్.. ధర ఎంత తక్కువ తెలిస్తే..?

praveen
దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ "ఏసర్' తాజాగా భారతదేశంలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లను ఎంటర్‌ప్రైజ్, విద్యా సంస్థల్లో పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. వీటి పేర్లు ఏసర్ క్రోమ్‌బుక్ ప్లస్ 15, క్రోమ్‌బుక్ ప్లస్ 14. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు ఎల్‌సిడి స్క్రీన్లతో వస్తాయి. అవి AMD, ఇంటెల్ రైజెన్ అనే ప్రాసెసర్లతో లాంచ్ అయ్యాయి. 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 16GB వరకు ర్యామ్ ఆప్షన్లతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో గూగుల్ ఏఐ ఆధారిత యాప్‌లు, ఫీచర్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా జెమినీ ఎఐ అనే కొత్త ఫీచర్ కూడా ఆఫర్ చేశారు.
ఏసర్ క్రోమ్‌బుక్ ప్లస్ 15 ల్యాప్‌టాప్‌ రూ.44,990 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ధరకు మీకు 8GB ram + 256GB స్టోరేజ్ లభిస్తుంది. ఏసర్ క్రోమ్‌బుక్ ప్లస్ 14 ల్యాప్‌టాప్‌ రూ.35,990 స్టార్టింగ్ ప్రైస్ తో రిలీజ్ అయింది. ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే పెద్ద సంస్థలు తమ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయించుకోవచ్చు. ఉదాహరణకు, స్క్రీన్, స్టోరేజ్ వంటి భాగాలను మార్చించుకోవచ్చు.
ఏసర్ క్రోమ్‌బుక్ ప్లస్ 15, క్రోమ్‌బుక్ ప్లస్ 14 క్రోమ్ OS పై వర్క్ అవుతాయి. ఇవి వరుసగా 14 అంగుళాలు, 15.6 అంగుళాల ఫుల్-HD IPS LCD స్క్రీన్‌లతో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తాయి. ఇవి జెమిని AI ఫంక్షన్లు, గూగుల్ ఫోటోల మ్యాజిక్ ఎరేజర్, వాల్‌పేపర్ క్రియేషన్, AI-క్రియేటెడ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్స్‌ వంటి ఇతర గూగుల్ AI సామర్థ్యాలకు సపోర్ట్ చేస్తాయి.
 క్రోమ్‌బుక్ ప్లస్ 14 AMD రైజెన్ 7000 సిరీస్ APU ద్వారా పనిచేస్తుంది, క్రోమ్‌బుక్ ప్లస్ 15 13th జెన్ ఇంటెల్ కోర్ i7 CPU ద్వారా నడుస్తుంది. 14-అంగుళాల వేరియంట్ 16GB ram మ్యాగ్జిమం స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. క్రోమ్‌బుక్ ప్లస్ మోడల్స్‌లో 512GB వరకు NVMe SSD స్టోరేజీ ఆఫర్ చేశారు. 14-అంగుళాల మోడల్‌ 256GB సింగిల్ వేరియంట్‌తో లాంచ్ అయింది. వీటిలో Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-సీ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-A కనెక్టర్‌లు, ఒక మైక్రోఎస్‌డీ కార్డ్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఆఫర్ చేశారు. వీటిని 65W స్పీడ్‌తో ఛార్జ్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: