బుల్లి పిట్ట: రూ.234 లకే 56 రోజుల కొత్త ప్లాన్ రిలీజ్ చేసిన జియో..!!
రిలయన్స్ జియో యూజర్స్ కోసం రూ.234 రూపాయలకే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రకటించారు. అయితే ఈ ప్లాన్ కేవలం..jio bharat phone యూజర్స్ కు మాత్రమే ఇది అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో జియో భారత్ ఫోన్ ఉపయోగిస్తున్న వారందరికీ ఈ ప్లాన్ యొక్క లాభాలను అందుకోవచ్చు.. ఇ ప్లాన్ స్మార్ట్ మొబైల్ లేదా ఇతర యూజర్స్ కి వర్తించదు.
Jio bharat phone:234
జియో భారత్ ఫోన్ యూజర్స్ కోసం రిలయన్స్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను సైతం తీసుకువచ్చింది. 56 రోజుల వాలిడిటీతో లభిస్తుంది.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్స్.. రోజుకు 0.5 gb డేటా చొప్పున 56 రోజుల వరకు పూర్తి వ్యాలిడిటీతో డైలీ డేటా కూడా లభిస్తుంది.. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64 kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాను కూడా మనం వినియోగించుకోవచ్చు.. అలాగే డేటా ప్రయోజనాలతో పాటు 28 రోజుల పాటు 300 ఎస్ఎంఎస్ లు చొప్పున 56 రోజులకు గాను 600 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు.. అలాగే జియో లో ఉండేటువంటి జియో సెవెన్, జియో సినిమా యాప్స్ ను సైతం వినియోగించుకోవచ్చు. ఇవే కాకుండా జియో యూజర్స్ కి మరికొన్ని ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నవి.