ఆర్డర్ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్ కార్ట్ కొత్త సర్వీస్?
కానీ ఇటీవల కాలంలో మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకుని ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ ఇస్తే చాలు కూర్చున్న చోటుకి డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉంది. ఏకంగా ఇలాంటి డెలివరీ చేసేందుకు ఎన్నో కంపెనీలు కూడా పోటీ పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇలా ఈ కామర్స్ రంగంలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తమ వినియోగదారులకు ఇక మిగతా కంపెనీలతో పోల్చి చూస్తే అత్యంత నాణ్యమైన సర్వీస్ లు అందించడం కోసం అన్ని కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ కామర్స్ రంగంలో దిగజ కంపెనీగా కొనసాగుతుంది ఫ్లిప్కార్ట్.
ఇక ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కస్టమర్ల కోసం ఒక కొత్త సర్వీస్ ను ప్రారంభించేందుకు అయింది. సేమ్ డే డెలివరీ పేరుతో ఈ సర్వీస్ ప్రారంభించబోతుంది. అంటే కస్టమర్ ఏదైనా ఆర్డర్ చేసిన రోజే వస్తువులను డెలివరీ చేయనుంది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇక ఈ నగరాల్లో హైదరాబాద్, విజయవాడ కూడా ఉండడం గమనార్హం. ఇక త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తాము అని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇక మరికొన్ని రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సర్వీస్ లను విస్తరింప చేయాలని అనుకుంటుందట ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం.