ఇండియా మ్యాప్ లో.. శ్రీలంకను చూపించడం వెనక ఇంత పెద్ద కారణం ఉందా?

praveen
సాదరణంగా ప్రపంచ పటం చూసినప్పుడు ఇక ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇక ఆ మ్యాప్ లో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఏదైనా దేశానికి సంబంధించిన ప్రత్యేకమైన మ్యాప్ చూస్తే కేవలం ఇక ఆ దేశం యొక్క సరిహద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో ఇక సంబంధించిన మ్యాప్ మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఇక ఆ దేశ చిత్రపటంలో ఇతర దేశానికి చెందిన సరిహద్దులు ఉన్నాయి అంటే అది చట్టపరంగా నేరంగా పరిగణించబడుతుంది అని చెప్పాలి. కానీ ఒక్క భారతదేశం విషయంలో మాత్రం అలా జరగదు.

 చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు భారతదేశ చిత్రపటాన్ని చూసే ఉంటారు. అయితే ఇక భారత దేశ విస్తీర్ణం ఎంత ఉందో ఇక ఈ మ్యాప్ లో చూడవచ్చు. అదే సమయంలో ఇక భారత్ పొరుగు దేశమైన శ్రీలంక కూడా అటు ఇండియా మ్యాప్ లో చూస్తూ ఉంటాం. వాస్తవానికి వేరే దేశానికి ఒక దేశం యొక్క మ్యాప్ లో చూపించడం నేరం. కానీ అటు భారత్ మ్యాప్ లో మాత్రం శ్రీలంకను ఎందుకు చూపిస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ లు కూడా ఇండియా సరిహద్దుల పక్కనే  ఉన్నాయి.

 కానీ ఈ దేశాలు ఏవి కూడా భారత మ్యాప్ లో కనిపించవు అని చెప్పాలి. కానీ శ్రీలంక మాత్రం కనిపిస్తుంది. ఇలా శ్రీలంక దేశం మన దేశం మ్యాప్ లో కనిపించడానికి ఒక పెద్ద కారణమే ఉందట. ఒక దేశ సరిహద్దుల్లో ఉన్న సముద్ర ప్రాంతాన్ని కూడా ఆ దేశం మ్యాప్ లో చూపించాలి. దీనిని ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదించింది. సరిహద్దులో ఉన్న సముద్రంలో 200 నాటికలు మైల్స్ అంటే 370 కిలోమీటర్ల సముద్రం వరకు మ్యాప్ లో చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం ప్రకారం మన దేశం 370 కిలోమీటర్ల సరిహద్దును చూపిస్తుంది. అందుకే మన దేశ మ్యాప్ లో శ్రీలంక కూడా కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలోని తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్ మైల్స్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో చట్ట ప్రకారమే ఇండియా మ్యాప్ లో ఇక శ్రీలంక ను చూపించడం జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: