బుల్లి పిట్ట: ఆధార్- పాన్ కార్డు లింక్ చేయలేదా..?

Divya
భారతదేశపు పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు కచ్చితంగా లింక్ చేయాలని IT శాఖ తెలియజేస్తోంది. ఈ ఏడాది జూన్ 30 వరకు మాత్రమే గడువును విధించింది.. అయినప్పటికీ కూడా చాలామంది మాత్రం ఆధార్ కార్డు పాన్ కార్డు ని లింక్ చేయకుండా ఉంటున్నారు. దీంతో చాలామంది ఇబ్బందులను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందట.. కొన్ని అకౌంట్లను కూడా హోల్డ్ లో పెట్టేస్తున్నారట .అయితే ప్రస్తుతం రుసుముతో ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి వాటిని లింకు చేసుకోవచ్చని పలువురు అధికారుల సైతం తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి.


ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ..https://www.incometax.gov.in/ అనే వెబ్సైట్ని సందర్శించడం మంచిది.

అక్కడ హోం పేజీలో ఎడమవైపున లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది..

ఆ తర్వాత పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డులో ఉండే విధంగానే మన పేరు మొబైల్ నెంబర్ ని సైతం నమోదు చేయవలసి ఉంటుంది.

దీంతో మన నెంబర్ కి ఓటీపీ సైతం వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత..అక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అక్కడ లింక్ అయ్యి ఉంటే ఆధార్ లింక్డ్ అని చూపిస్తుందట.


ఎస్ఎంఎస్ ద్వారా పొందాలి అంటే:
మొబైల్ మెసేజింగ్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత..UIDPAN టైప్ చేసి..12 అంకెల ఆధార నెంబర్..10 అంకెల పాన్ నెంబర్ ను టైప్ చేసి.. ఆ టైప్ చేసిన మెసేజ్ ను 56161 లేదా 567678 అనే నెంబర్ కి సెండ్ చేయాలి ఈ స్టెప్స్ ద్వారా మీ ఆధార్ పాన్ కార్డు లింక్ స్టేటస్ సైతం మన రిజిస్ట్రేషన్ మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. ఈ విధంగా ఆధార్ పాన్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: