బుల్లి పిట్ట: మొబైల్ డిస్ప్లే బ్లాక్ అవుతూఉందా.. అయితే ఇలా చేయండి..!!
ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఉపయోగించేటప్పుడు కొన్నిసార్లు మొబైల్స్ ఒక్కసారిగా స్ట్రక్ అయి బ్లాక్ అవుతూ ఉంటాయి. అయితే మొబైల్ కొంత సమయం తర్వాత తిరిగి ఆటోమేటిక్గా నార్మల్ స్థానానికి వస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే స్క్రీన్ బ్లాక్ అయినా వెంటనే చాలా మంది భయభ్రాంతులకు గురై మొబైల్ ని సర్వీస్ సెంటర్ కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా ఇవ్వడానికి బదులు ఒక చిన్న పని చేస్తే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చు.
మీ మొబైల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే వాటిని పరిష్కరించుకునేందుకు ముందుగా మన మొబైల్ ఎందుకు స్క్రీన్ బ్లాక్ అవుతుందో అనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యము.. స్క్రీన్ ఇలా బ్లాక్ అవ్వడానికి ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయట.. ముఖ్యంగా స్క్రీన్ బ్లాక్ అవ్వడానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే మనం ఏదైనా యాప్స్ ని అవుట్డే డేట్ యాప్స్ ని ఉపయోగించడం వల్ల ఆపరేటింగ్ సిస్టానికి అనుకూలించక లేకపోవడం వల్ల ఇలాంటి లోపాలు స్క్రీన్ మీద ఏర్పడతాయట.
మరి కొంతమంది ఏవైనా సినిమాలను పాటలను కంప్యూటర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ మెమొరీ కార్డును మొబైల్ లో వేయడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుందట. ఈ వైరస్ వల్ల మొబైల్ పాడు అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
నెట్లో సర్చింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డేటా బదిలీ అవుతున్నప్పుడు ఈ వైరస్ మొబైల్ లోకి ప్రవేశించి స్క్రీన్ ని బ్లాక్ చేస్తుంది.
అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మొబైల్ బ్యాటరీ వాళ్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయట బ్యాటరీ ప్రాబ్లం వల్ల కూడా స్క్రీన్ ఇలా ఒక్కొక్కసారి బ్లాక్ అవుతుందట.
మరొకటి ఏమిటంటే ఇటీవల ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మొబైల్ ఇలా అయితే ఆ యాప్ ని డిలీట్ చేయడం మంచిది.