బుల్లిపిట్ట: స్మార్ట్ ఫోన్లో తరచూ తలెత్తే సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!

Divya
సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు కూడా తరచూ సమస్యల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా స్టోరేజ్ పెరిగిపోవడం వంటివి మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్లో చిన్న సమస్య వచ్చినా సరే దానిని సరి చేయడానికి వేల రూపాయల ఖర్చు అవుతోంది. ఒక్కొక్కసారి రిపేరీ కంటే కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇకపోతే స్మార్ట్ ఫోన్లలో తరచూ తలెత్తే సమస్యలకు కొన్ని టిప్స్ ఫాలో అయితే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ స్లో అవ్వడం అనేది ప్రతి ఫోన్లో సర్వసాధారణం. దీన్ని పరిష్కరించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి అనవసరమైన ఆప్లను తొలగించాలి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ మెమరీ ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ మునుపటి కంటే కొంచెం వేగంగా పనిచేయడం ప్రారంభం అవుతుంది.

ఇక స్మార్ట్ ఫోన్లో వచ్చే మరొక సమస్య మొబైల్ వేడెక్కడం.. రోజంతా కూడా చాలామంది మొబైల్ ఫోన్ కి అతుక్కుపోయి ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ కచ్చితంగా వేడెక్కుతుంది. ముఖ్యంగా మనిషికి విశ్రాంతి ఎంత అవసరమో.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గాడ్జెట్స్ కి కూడా విశ్రాంతి అంతే అవసరం.. కాబట్టి మీరు సమస్యను తగ్గించడానికి మీ ఫోన్ ను పవర్ సేవర్ మోడ్ లో ఉంచాలి. స్క్రీన్ బ్రైట్నెస్ ని కూడా తగ్గించాలి. వైఫై,  బ్లూటూత్ లను అనవసరంగా ఉపయోగించకూడదు. అంతేకాదు ఎప్పుడు చార్జింగ్ పెట్టకూడదు.

ఇక స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ త్వరగా అయిపోతే మీ ఫోన్ యొక్క స్క్రీన్ బ్రైట్నెస్ ను తగ్గించాల్సి ఉంటుంది. అలాగే లొకేషన్ సర్వీస్ మొబైల్ డేటా,  జిపిఎస్, బ్లూటూత్ వంటి ఉపయోగం లేకుండా ఆన్ లో ఉంచకూడదు. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్ ఫోన్లో వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: