బుల్లి పిట్ట: ఒక్క వాట్సాప్ ఖాతని.. ఎన్ని మొబైల్స్ లో యూజ్ చేసుకోవచ్చొ తెలుసా..?

Divya
గడచిన కొన్ని నెలల క్రితం వరకు ఎక్కువగా మొబైల్, డెస్క్ టాప్, ల్యాప్ టాప్ వంటి వాటిలో మాత్రమే వాట్సప్ ఖాతాను ఉపయోగించుకునే అవకాశం ఉండేది అయితే ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ మొబైల్లలో వీటిని ఉపయోగించుకోవడం వీలుకాకుండా ఉండేది.. అయితే ఇటీవల వాట్సాప్ సంస్థ.. మెసేజింగ్ అప్లికేషన్ లో సరికొత్త ఫీచర్ ని సైతం విడుదల చేయడం జరిగింది. వాట్సప్ ఈ కొత్త ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఒకే సమయంలో నాలుగు మొబైల్స్ లో ఒకే వాట్సప్ ను ఉపయోగించుకోవచ్చట.

అంటే మనం నాలుగు మొబైల్స్ లో ఒకే వాట్సప్ ఖాతాను కూడా ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ ను వేరే మొబైల్ లో ఉపయోగించుకోవాలి అంటే మనం దాన్ని కొత్తగా ఇన్స్టాల్ చేయాలి ఆ పైన ఖాతాని సెటప్ చేస్తున్నప్పుడు మొబైల్ నెంబర్ నమోదు చేయడానికి బదులుగా ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత QR కోడ్ కనిపిస్తుంది.. అప్పుడు మీరు వాట్సాప్ ఖాతా కలిగి ఉన్న మొబైల్ నుండి స్కాన్ చేయడం ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్ ఆండ్రాయిడ్, IOS వంటి స్మార్ట్ మొబైల్స్ లో కూడా అందుబాటులో ఉన్నది.
అన్ని వాట్సప్ అన్నిటిలో కూడా ఇలా లాగిన్ కావచ్చు. ఒకేసారి నాలుగు మొబైల్స్ ఒకే వాట్సప్ ఖాతాను ఉపయోగించుకునే ఈ ఆప్షన్ మెసేజింక్ ప్రక్రియ మరింత సులభవంతంగా మారుతోంది.అదనంగా సైన్ అవుట్ చేయకుండా మరొక మొబైల్ నుంచి సందేశాలు సైతం పంపించడం ద్వారా సగంలో ఆగిపోయిన చాటింగ్ కూడా కొనసాగించడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా వ్యాపారులు ఇలాంటి ఫీచర్ ను సైతం బాగా ఎంపిక చేసుకొని ప్రయోజనాన్ని పొందుతున్నట్లుగా ఒక పరిశోధనలో తేలినట్లు తెలుపుతున్నారు టెక్ నిపుణుల.. ఇలా ఒకేసారి నాలుగు ఖాతాలను ఒకే నెంబర్ కి ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్లతో కమ్యూనిటీ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: