సూర్యుడి మిస్టరీని మన ఇండియా కనిపెడుతుందా?

శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత చంద్రుడు పైకి చేరడం అనే కల నెరవేరింది. తాజాగా భారత్  చంద్రయాన్ అనే విప్లవాత్మకమైన ప్రయోగం ద్వారా చంద్రుని గురించిన అనేక విషయాలను తెలుసుకునే పనిలో ఉంది. ఈ చంద్రయాన్ ప్రయోగం గురించిన ఫైనల్ రిజల్ట్ ఈనెల 23వ తేదీన తెలియనుండడంతో దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి.  ఆ తర్వాత సూర్యుడు పైకి కూడా  ప్రయోగాలు చేసే దిశగా ఆలోచిస్తుంది ఇస్రో‌.

 దాని కోసం ఆదిత్య యల్ వన్ అనే 170కేజీల విజిబుల్ కమిషన్  లైన్ కరోనా గ్రాఫ్ వెల్సి అనే పేలోడ్ ని ఇప్పటికే సిద్ధం చేసింది. దీని ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సూర్యుడులోని మార్పులు, అంతరిక్ష వాతావరణం భూ ఉపరితల వాతావరణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు.

200 నుండి 400 ఎస్ఎం తరంగ దైర్ఘ్యాల  మధ్యలో పని చేసే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ అనే 35కేజీల పేలోడ్ కూడా సూర్యుడిని పరిశీలిస్తుందని తెలుస్తుంది. 11ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సూర్యుడిలోని వివిధ పొరలకు సంబంధించిన డిస్క్ ఫొటోస్ ని కూడా అందిస్తుంది ఇది. అంతేకాకుండా ఇది సూర్యుడిని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ నుండి రాంప్రకాష్, దుర్గేష్ త్రిపాటి నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేశారు.

ఆదిత్య సోలార్ విండ్ ప్రాక్టికల్ ఎక్స్పరిమెంట్  యుసెక్స్ అనే పేలోడ్  సౌర గాలి యొక్క లక్షణాలను, దాని వర్ణపట లక్షణాలను కూడా అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ సౌర గాలి యొక్క కూర్పు, దాని శక్తి పంపిణీని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ సమస్యాత్మకమైన సోలార్ కరోనా హీటింగ్ మెకానిజంను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: