ఆ రంగంలో అమెరికా, ఇండియా చేయికలిపితే?

అంతరిక్షంలో రష్యా అగ్రగామిగా ఉండేది. దీంతో గతంలో అమెరికా రష్యా సహాయం తీసుకుని అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపించేది.  తర్వాత ఎవరికి వాళ్లే స్వశక్తితో పని చేసుకున్నారు.  ఎన్నో రాకెట్లను పంపించారు. ఏకంగా చంద్రుని మీద మొదట అడుగు పెట్టింది రష్యా కు చెందిన వ్యక్తి అని అందరికి తెలిసిందే. అయితే అమెరికా తదనంతరం నాసా ను స్థాపించుకుని ఎన్నో ప్రయోగాలు చేసింది. మరెంతో ముందుకు దూసుకెళ్లింది.

ఇలా అంతరిక్ష రంగంలో ఎన్నో ఘనతలు సాధించిన అమెరికా. ప్రస్తుతం ఇండియాను కూడా పార్టనర్ గా చేర్చుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి తెలిపింది. అమెరికా, భారత్ కలిసి అంతరిక్ష రంగంలో ముందుకు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే భారత్ అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యల సాయం తీసుకోకుండా స్వయంగా ముందుకెళ్లింది. గగన్ యాన్ లాంటి ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు తిప్పుకుంది.

ఇలాంటి సందర్భంలో స్వయం శక్తితో ఎదిగిన భారత్ వైపు అన్ని దేశాలు చూడటం సహజం. శ్రీహరికోట నుంచి ఒకే సారి 100 కు పైగా రాకెట్లను ప్రయోగించి భారత్ కు ఉన్న సత్తా చాటింది. ఇలాంటి సందర్భంలో రష్యా, అమెరికా, చైనా బ్రిటన్ లాంటి దేశాలు ఈ ప్రయోగాన్ని నిశితంగా గమనించాయి. భారత్ ప్రయోగాల విషయంలో పాటిస్తున్న క్రమశిక్షణ, ఇక్కడ ఉన్న నిపుణులు, సైంటిస్టులు, ప్రణాళిక బద్ధంగా చేస్తున్న ప్రయోగాలు అమెరికాకు నచ్చాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం నాసాపైనే ఆధారపడి ఉండేవి.

అమెరికా, భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సరికొత్త భాగస్వామి దొరికినట్లయింది. దాదాపు 23 దేశాలు ఇప్పటికే అమెరికాలో అంతరిక్ష భాగస్వామిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ కూడా సంయుక్తంగా ప్రయోగాలు చేయడం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారన్నది ఇస్రో చేతుల్లో ఉంది. రాబోయే ఇస్రో, నాసా చేసే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: