ఛాట్ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?
కృత్రిమ మేధ అనేది సంచలనం అని కంపెనీలే కృత్రిమ మేధను సీఈవోలుగా నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు డిగ్రీలు అయిపోయాక భవిష్యత్తు చూసుకోవచ్చని అనుకుంటున్నారు. మన వారు మార్కులు, ర్యాంకులు, ఐఐటీ కోచింగ్ లకు గురించి చర్చించుకుంటున్నారు. వందేళ్ల క్రితం ఒక పాండమిక్, మొన్నటికి మొన్న కరోనా, మరో సారి మానవులపై మరో మహామ్మారి విరుచుకుపడేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఒక వేళ మనిషి బతికినా జీవశ్చవంలా గడపాలనేది కొంతమంది కోరిక. పార్మాకు చెందిన వారి భయంకరమైన ప్లాన్ ఏంటంటే మనిషి బతికినా ఎప్పుడూ రోగ నిరోధక శక్తి కోల్పోయి డబ్బులు పెట్టే ఏటీఎంలా వారు మారాలని అనుకుంటున్నారు. అయితే అలాంటి మార్పులకు అనుగుణంగా మారేందుకు కొన్ని వేల మంది విద్యార్థులను మలిచే అవకాశం దక్కిందని అమరానాథ్ వాసిరెడ్డి అన్నారు. అలా 60 చాప్టర్లతో ఒక పుస్తకాన్ని రాశారు. చాట్ జీపీటీ, గూగుల్ లకు కూడా అందని విషయాలు వచ్చే విధంగా ఆయన పేపర్ ను తయారు చేస్తున్నారు. దాదాపు గ్రూపు, సివిల్స్ లాంటి అంశాలు ఉండేలా విద్యార్థులు, టీచర్లు వారి మేథో సంపత్తిని మరింత మెరుగుపరుచుకునేలా చేయడానికి కృషి చేస్తున్నారు.
టీచింగ్ మెలకువలో ట్రైనింగ్ లు, పాయింట్ రాయకపోతే 50 శాతం మార్కుల కట్ ప్రయోగాలు చేస్తున్నారు. కృత్రిమ మేధ కాకుండా దాని కంటే ఉన్నతంగా ఆలోచించే మేథో సంపత్తును సాధించడం ద్వారా విద్యార్థులు రాబోయే భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవవచ్చు. సమాచారం కావాలంటే ఆలోచించి తెలుసుకోవడం శోధించడం, సాధించడం మానేశారు.