ట్రూకాలర్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరం లేదు?

praveen
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ యాప్ ఉపయోగిస్తున్న వారు కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ ఏవో ఈజీగా గుర్తించగలరు. ఇంకా ఈ యాప్ తన యూజర్లకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. తాజాగా వారి శ్రేయస్సు మేరకు మరొక సేఫ్టీ ఫీచర్ పరిచయం చేసింది. అన్‌వాంటెడ్ కాల్‌లను గుర్తించి బ్లాక్ చేయడానికి ఉపయోగించే ఈ యాప్ రీసెంట్‌గా మోస పూరిత ఎస్ఎంఎస్‌ మెసేజ్‌ల నుంచి వినియోగ దారులను రక్షించడానికి కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది.
మోసపూరిత మెసేజ్‌లను పంపినవారిని, మెసేజ్‌లను గుర్తించడానికి ఈ ఫీచర్ కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తుంది. అప్పుడు యూజర్లు ఎలాంటి మోసం అయినా ఈజీగా తెలుసుకోవడం కుదురుతుంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకొని యూజర్లను మోసం చేస్తుంటారు. ఇన్సూరెన్స్, లోన్‌ వంటి స్కాములకు పాల్పడుతున్నారు. ఈ కొత్త ఫీచర్‌తో ఇకపై వారి ఆటలు సాగవు. సరికొత్త 'ఫ్రాడ్ ప్రొటెక్షన్' ఫీచర్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్ యూజర్ మొబైల్‌కు ఏదైనా ఫ్రాడ్ మెసేజ్ వస్తే వెంటనే ఒక రెడ్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. నోటిఫికేషన్ వినియోగదారుని ఎటువంటి చర్య తీసుకోవద్దని హెచ్చరిస్తుంది. మాన్యువల్‌గా రిమూవ్ చేసే వరకు స్క్రీన్‌పైనే ఉంటుంది. ఒకవేళ వినియోగదారు మొబెల్‌లో ఆ అలర్ట్ మెసేజ్ క్లోజ్ అయి, మోసపూరిత SMSని తెరిచినట్లయితే, ట్రూకాలర్ అన్ని లింక్‌లను నిలిపివేస్తుంది. తద్వారా యూజర్ల సేఫ్టీ పెరుగుతుంది. పంపినవారిని సురక్షితంగా వినియోగదారు స్పష్టంగా తెలుసుకున్న సందర్భంలోనే ఆ SMS థ్రెడ్‌కు యాప్ యాక్సెస్ ఇస్తుంది. యాప్ వినియోగదారుడి పరికరంలో లోకల్ డేటాను ప్రాసెస్ చేస్తుంది. మొత్తం మీద ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ఎలాంటి స్కామ్ కాల్స్ నైనా సరే ఎంతో సులభంగా గుర్తించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: