సెల్‌ఫోన్ పోతే దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా రకాలుగా మంది ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన CEIR(CENTRAL EQUIPMENT IDENTITY REGISTER) టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను చాలా ఈజీగా తిరిగి కనిపెట్టే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఉపయోగించి సీఈఐఆర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఈజీగా బ్లాక్ చేయవచ్చు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబర్‌తో కూడా బ్లాక్ చేయవచ్చు.ఇక ఆ తర్వాత ఆ సెల్‌ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్‌చేసి అందులో సిమ్ తీసి కొత్త సిమ్ వేసినా ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్‌ఎంఎస్ ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.మీరు సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.అందులో బ్లాక్ ఫోన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.మొబైల్ నంబర్-1, మొబైల్ నంబర్-2, ఫోన్ బ్రాండ్, మోడల్ ఇంకా ఇన్వాయిస్(బిల్)ఫొటో సూచించిన గడుల్లో నింపాలి.
తరువాత పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామాలు, అంతకుముందే ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ నంబర్, ఫోన్ యజమాని చిరునామా, ఈ మెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు ఇంకా ఇలా వీటన్నింటిని సూచించిన బాక్సుల్లో నింపాలి.ఇక వెంటనే మీ సెల్‌ఫోన్ పాత నంబర్ మీద తీసుకున్న కొత్త సిమ్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.ఇక ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ దానంతట అదే ఈజీగా బ్లాక్ అవుతుంది. ఇక నుంచి దాన్ని ఎవరూ కూడా ఆపరేట్ చేయలేరు. అందులో ఉన్న డేటా మొత్తం కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే మీ నంబర్‌కు ఈజీగా మెసేజ్ వస్తుంది.ఇక ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా పట్టుకోవడం ఈజీ అవుతుంది.ఇక మీ సెల్‌ఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా లేక మీకే దొరికినా మీ పాత ఐడీ, ఫోన్ నంబర్ ఇంకా ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోన్‌ను ఈజీగా ఆన్‌బ్లాక్ చేసుకోవచ్చు.