బుల్లి పిట్ట: హోండా యాక్టివా నుంచి సరీ కొత్త బైక్..!!

Divya
దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టూ వీలర్ బైక్స్ లలో హోండా యాక్టివా కూడా ఒకటి.. ఇప్పుడు మరొక కొత్త అప్డేట్ ను ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. హోండా యాక్టివా 125 H స్మార్ట్ పేరిట దీనిని తీసుకురావడం జరిగింది. దీని గురించి ఒక టీజర్ కూడా విడుదల చేసింది.. స్కూటర్లలో హోండా యాక్టివా తిరుగులేని స్టార్ డమ్ అందుకుందని చెప్పవచ్చు. చాలామంది ఈ బ్రాండెడ్ బైక్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇందుకు పోటీగా చాలా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం జరిగింది.

మరొక వైపు యాక్టివా తన మోడల్స్ ను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన 6G మోడల్ స్కూటర్ ను రిమోట్ కి లాంచ్ సూపర్ ఫీచర్ తో తీసుకురావడం జరిగింది. హోండా యాక్టివా 125 H స్మార్ట్ పేరిట దీనిని తీసుకువచ్చినట్లు తెలియజేస్తోంది ఆ సంస్థ. ఇంకా ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇటీవలే.. విడుదలైన 6G బైకుకు ఇవి దగ్గర పోలికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బైక్ లో కూడా ఎలక్ట్రిక్ కి, పుష్ బటన్స్, స్మార్ట్ వంటి ఫీచర్స్ కూడా కలవు. అలాగే పార్కు చేసిన బైక్ ని కనుగొనేందుకు వీలుగా సిగ్నల్ ఇండికేటర్ కూడా కలదు.
ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న బైకు ధరల కంటే రూ.10 వేల రూపాయలు అదనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ మూడు రకాల వేరియంట్ లో యాక్టివ్ గాను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక దీని ధర ప్రారంభం నుంచే రూ.81,411 పైనుంచి ప్రారంభమవుతుంది అలాగే డిస్క్ బ్రేక్ కు అదనంగా 2000 రూపాయలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో హోండా యాక్టివా 125 H బైక్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: